TTD Chairman: హిందూ వ్యతిరేఖి అయిన వ్యక్తి గతంలో టీటీడీ ఛైర్మన్ కావడం దురదృష్టమని అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన వేషాలు వేస్తున్నారని, ఆయన నిజమైన హిందువు కాదన్నారు. ఆయన పిల్లలకు ఏ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేశారని మండిపడ్డారు. రాజకీయాలుంటే పార్టీలతో చూసుకోవాలని గానీ, టీటీడీని మధ్యలోకి లాగడమేంటని ప్రశ్నించారు.
గోవుల మృతిపై రచ్చ
ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. గోవుల వ్యవహారంపై జరుగుతున్న రచ్చకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాము వచ్చి దాదాపు ఐదునెలలు పైగానే అవుతుందన్నారు. ఆయన సంతకాలు చేసిన ఫైళ్లు చూస్తుంటే కమిషన్లు లేకుండా ఏ పనీ చేయలేదన్నారు. ఏ ఐటెమ్ తీసుకున్నా, ప్రతీది స్కామ్, కమిషన్లు తీసుకున్నారని కొత్త ఆరోపణలు చేశారు. రూ. 1600 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చారని, అందులో 8 నుంచి 10 శాతం కమిషన్లు తీసుకున్నారని అన్నారు.
గడువు తీరిన మందులను గోవులకు ఇచ్చారని, పురుగులు పట్టిన దాణా గోవులకు ఇచ్చారన్నారు. గోవులకు సహజంగా వచ్చే మరణాలు ఉంటాయన్నారు. వయస్సు అయిన ఆవులు ఉంటాయని గుర్తు చేశారు. ఆరోగ్యం బాగా లేక మనుషులు చనిపోతున్నారని, ఆవులు చనిపోవా అంటూ ప్రశ్నించారు. ఇందులో టీటీడీ నిర్లక్ష్యం అనేది లేదని, ఈ విషయాన్ని తాను ఓపెన్ గా చెబుతున్నట్లు వెల్లడించారు.
టీటీడీకి చెడ్డ పేరు తేవడానికి ఆయన ఇక్కడ ఉన్నారన్నారు. భూమన చరిత్ర ప్రజలకు తెలుసన్నారు. ఇలాంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదన్నారు. దేవుడి సొమ్ము వారు ఎవరూ బతకలేదన్నారు. తప్పకుండా ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తారన్నారు. రోజూ టీటీడీ మీద పడుతున్నారని మండిపడ్డారు. అదే వేరే మతం మీద పడాలన్నారు. కేవలం హిందువుల మీద పడుతున్నారని ధ్వజమెత్తారు. భూమనకు భయం, భక్తి రెండు లేవన్నారు.
ALSO READ: భారతిని తిట్టినోడ్ని బాబు జైల్లో వేయించడం సహించలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు
ఇకపై క్రిమినల్ కేసులు ఖాయం
మీడియా సమావేశం సందర్భంగా బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ ఓ విషయాన్ని వివరించారు. బోర్డు సభ్యుడిగా కరుణాకర రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఛైర్మన్‌కు బీఆర్ నాయుడికి మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ విషయంలో చాలా చోట్ల కేసులు బుక్కవుతాయన్నారు. కేసుల విషయంలో చాలా మంది ఎలా తిరుగుతున్నారో చూస్తున్నారు కదా? ఇకపై భూమనకు చుక్కలు చూపిస్తాన్నారు. ఇకపై మామూలుగా ఉండదన్నారు.
మా హయాంలో టీటీడీకి సంబంధించి ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని ఆవులు చనిపోయాయని మీడియా ప్రశ్నించింది. దీనిపై త్వరలో మీకు వివరాలు ఇస్తామన్నారు. 1776 ఆవులు ప్రస్తుతానికి ఉన్నాయన్నారు. గతంలో ఉన్న అధికారులు ఇంకా కొనసాగుతున్నారని, వాటిని బదిలీలు చేస్తామన్నారు. పశువుల డాక్టర్ ఒకరు పారిపోయారని అన్నారు.
తనను టార్గెట్ చేసినా పర్వాలేదని, టీటీడీని ఇలాంటి వివాదాల్లోకి లాగడం దారుణమన్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం. ఈ విషయాన్ని బోర్డు సమావేశాల్లో పెట్టాలని భావిస్తోంది టీటీడీ.
అంతకుముందు మాట్లాడిన బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని దుయ్యబట్టారు. దేవుడిపై నమ్మకం లేని భూమనను టీటీడీ ఛైర్మన్‌గా చేశారన్నారు. కమిషన్ల కోసం పటిష్టమైన భవనాలను సైతం కూల్చేశారని దుయ్యబట్టారు. మాసీ సీఎం జగన్ ఏనాడూ టీటీడీ సంప్రదాయాలను పాటించలేదన్నారు. గోవులు, గోవిందుడితో ఆటలు వద్దు సూచన చేశారు.