Tirumala: సమ్మర్ వచ్చిందంటే చాలు తిరుమల గిరుల్లో ఉన్న ప్రమాదకరమైన జంతువులు బయటకు వస్తుంటాయి. ఎండ వేడిమి తట్టుకోలేక వల్ల వస్తుంటాయని చెబుతుంటారు జంతు ప్రేమికులు. ఒక్కోసారి నాగులు మనుషులను కాటేసిన సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో రకరకాల నాగుపాములు బయటకు వస్తున్నాయి. స్నేక్ క్యాచర్‌గా పేరుపొందిన టీటీడీ మాజీ ఉద్యోగి భాస్కర్ నాయుడు ఓ కోబ్రా తిరుమలలో ఓ కాటేజీలోకి వచ్చిన విషయం తెలియగానే ఆయన క్షణాల్లో అక్కడ వాలిపోయారు.
తిరుమలలో నారాయణగిరి స్పెషల్ కాటేజ్‌లో నాగుపామును టీటీడీ మాజీ ఉద్యోగి, స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు తనదైన శైలిలో పట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని అడవిలోకి వదిలేశాడు. ఐదున్నర అడుగుల పొడవైన కోబ్రాను పట్టుకోవడానికి బాగానే శ్రమించాల్సి వచ్చింది. తిరుమల గిరుల్లో తిరిగే అరుదైన కోబ్రాల్లో అత్యంత విషసర్పమని అంటున్నారు. అరగంట పాటు ఆ కాటేజీలో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
తిరుమల గిరుల్లోనే ఎందుకు?
శతాబ్దాల కిందట తిరుమల కొండలు భక్తులలు రాక మునుపు అక్కడ ప్రాచీన నాగుల వంశం జీవించేదని అంటున్నారు. అవి సాధారణ సర్పాలు ఎంత మాత్రం కావు. వీరంతా మానవ రూపంలోకి మారే శక్తి గల నాగిణులు లేదా నాగులు. నాగుల నాయకుడి పేరు నాగ శేఖరుడు. అతడు తన ధ్యానం, తపస్సుతో శివుడి అనుగ్రహం పొందాడు. శివుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. నీ వంశం ఎప్పటికీ ఈ కొండల్లో సంరక్షణ ఉంటుందని, మీ వంశంపై మానవులు అత్యాశ చూపినప్పుడు వారు నీ శాపాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నది ఆ వరంలోని అర్థం.
ఇదంతా ఒకప్పటి మాట. కాలం మారింది.. తిరుమల కొండలు జనాలతో నిండిపోయాయి. దేవాలయ నిర్మాణం జరగడంతో నాగుల వంశం కొంచెం కొంచెం అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఆ దేవస్థానానికి భద్రతగా ఉండాలని నిర్ణయించారట నాగుల వంశం. ప్రత్యక్షంగా కనిపించకపోయినా, అవి ఎన్నో రహస్య మార్గాల ద్వారా తిరుమలను రక్షిస్తూనే ఉంటాయని కొందరు పెద్దలు అప్పుడప్పుడు చెబుతారు.
ALSO READ: చర్చిలో 11 ఏల్ల బాలిక మృతి కేసులో మరో ట్విస్ట్
నాగుల గురించి మరో కథ
ఓ గిరిజన బాలుడు అడవిలో వెళ్తుండగా ఓ పాత బిలాన్ని గమనిస్తాడు. ఆ బిలంలోకి వెళ్లిన అతడికి నీలంగా మెరుస్తున్న నాగు పాము కనిపించింది. ఆ పాము అతడితో మాట్లాడిందని, నాగుల గురించి రహస్యాన్ని అంతా వివరించిందని చెబుతుంటారు. చివరకు పాము వెంట నాగ లోకానికి చేరుకుంటాడు. నురుగు నీళ్ళతో నిండిన సరస్సు, ఉగాది పూలతో అలంకరించిన చెట్లు, సర్ప రూప దేవతలు కనిపించారు.
ఈ రహస్యం అతడికి మాత్రమే తెలిసిందని అంటుంటారు. తిరుమల కొండల్లో పుట్టిన జలానికి మూలం నాగుల రక్షణ వల్ల కలుగుతున్నదని అంటుంటారు. ఆ గిరుల్లో నది మార్గాలు నియంత్రించేది వాళ్లేనని భావన ఇప్పటికీ కొందరిలో ఉంది. ఆ రహస్యాన్ని గిరి పుత్రుడు ఎప్పుడూ బయట పెట్టలేదు. తన కుమారునికి ఈ విషయాన్ని చెప్పాడు.
అప్పటి నుంచి ఆ కుటుంబం నాగులకు భక్తిగా జీవిస్తూ, తిరుమల కొండలను పరిరక్షించే లక్ష్యంగా పని చేస్తుందని అంటుంటారు ఆ ప్రాంతంలోని పెద్ద వయస్సువారు. నాగుపాము-మహా విష్ణువు మధ్య బంధం ఇప్పటిది కాదు. చెడును పారద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో శేష నాగు విష్ణుమూర్తికి ఎంతో సహకరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచి విష్ణుమూర్తి ఎక్కడుంటే ఆ ప్రాంతంలో నాగుపాముల సంచారం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.