BigTV English

Surya Son Of Krishnan : ఇది కేవలం సినిమా మాత్రమే కాదు – వెంకీ అట్లూరి

Surya Son Of Krishnan : ఇది కేవలం సినిమా మాత్రమే కాదు – వెంకీ అట్లూరి

Surya Son Of Krishnan : సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా సూర్యని ఓన్ చేసుకుంటారు అని చెప్పాలి. ముఖ్యంగా చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయం సూర్య ఒక తమిళ్ నటుడు అని, అంతలా తెలుగు ప్రేక్షకులు సూర్యని ప్రేమించడం మొదలుపెట్టారు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను సూర్య అందించారు. రీసెంట్ గా సూర్య ప్రొడ్యూస్ చేసిన సత్యం సుందరం సినిమా కూడా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ లో చూసిన చాలామంది ఈ సినిమా పైన ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం సూర్య రెట్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మే1 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.


సూర్య సన్నాఫ్ కృష్ణన్

సూర్య కెరీర్ లో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా మూడుసార్లు రీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా రెట్రో సినిమా ఈవెంట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ కేవలం సినిమా మాత్రమే కాదు. అది ఒక పుస్తకం. లవ్ లో ఎలా పడాలో నేర్పించింది. లవ్ ఫెయిల్ అయితే ఎలా బయటపడాలో నేర్పించింది. తండ్రీ కొడుకుల మధ్య ప్రేమను చూపించింది. అని సినిమా కాన్సెప్ట్ను మరోసారి గుర్తు చేశాడు వెంకీ అట్లూరి.


రెట్రో పై అంచనాలు

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కార్తీక్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా పిజ్జా తోనే చాలామంది ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తెరకెక్కించిన జిగర్తాండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కార్తీక్ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అంటే పేటా అని చెప్పాలి. రజనీకాంత్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇప్పుడు సూర్యతో చేస్తున్న సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇది అందరూ ఒక గ్యాంగ్ స్టార్ సినిమా అని ఊహించారు. కానీ ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అని కార్తీక్ సుబ్బరాజ్ పలు ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చాడు. ఈ సినిమాతో పాటు నాని నటించిన హిట్ 3 సినిమా కూడా అదే రోజున రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Also Read : మహేష్ బాబు 5.9 కోట్ల స్కాం… నేడే విచారణ… అరెస్ట్ కూడా…?

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×