BigTV English

Gnanapuram Church Case: చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య

Gnanapuram Church Case: చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య

Gnanapuram Church Case: విశాఖపట్నం జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ వెలుగుచూసింది. అనుమానితులుగా ఉన్న చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ కేసులకు భయపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.


కాగా.. ఇది 2025.. ప్రపంచం ఎంతో అడ్వాన్స్‌డ్‌‌గా మారిపోయింది. టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతోంది. అయినా సరే.. కొందరు జనాల్లో మార్పు రావట్లేదు. ఇంకా.. మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. మంత్రాలను, చేతబడులను, క్షుద్ర పూజలను నమ్మి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటుంటే.. ఇంకొందరు అంతకంటే విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలు.. మంత్రాలకు అంత శక్తి ఉందా? ఈ పూజలని నమ్మితే అంతేనా?

మంత్రం లేదు.. తంత్రం లేదు!


మాయ లేదు.. మర్మం లేదు.!

అంతా.. లాజిక్ లేని మ్యాజిక్కే!

నమ్మారో.. ఇక అంతే! మీ పెట్టెల్లో దాచుకున్న డబ్బంతా పూజల పేరుతో దోచేస్తారు. మీ నమ్మకాన్ని.. ఫుల్లుగా క్యాష్ చేసుకుంటారు. చివరకు.. చిల్లి గవ్వ కూడా మిగలకుండా.. మీ జేబుకు చిల్లు పెట్టేస్తారు. మూఢ నమ్మకాల జాడ్యం ఇంకా మనషుల్లో దాగే ఉంది. అది.. ఎప్పటికి పోతుందో.. వాటి నుంచి ఎప్పటికీ బయటపడతామో.. క్లారిటీ లేదు. కానీ.. మూఢ నమ్మకాలను మనల్ని తరతరాలుగా వెంటాడుతూనే ఉన్నాయ్. చేతబడులు, క్షుద్రపూజలు, మంత్రగాళ్లు.. ఏదో రకంగా మన బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు. అయినా.. మంత్రాలకు చింతకాయలే రాలవు. అలాంటిది.. రోగాలు నయమవుతాయా? మాయలతో వైద్యం చేయలేరు. మర్మంతో.. రోగాలు నయం చేయలేరు.

తరతరాలుగా వెంటాడుతున్న మూఢ నమ్మకాలు

ఈ మంత్రం, తంత్రం లాంటివి అసలే లేవు. అవి.. మానసిక వ్యాధులను అసలే తగ్గించవు. నమ్మారో.. అడ్డంగా బుక్కైపోయినట్లే. మీ డబ్బులు గుంజేందుకు.. మీతో మూఢ నమ్మకంతో పబ్బం గడుపుకునేందుకు.. అదో విద్య మాత్రమే. అంతకుమించి మరొకటి లేదు. కూటికోసం కోటి విద్యలన్నట్లు.. మన మీద పడి బతికే బ్యాచ్‌లో ఈ మాయగాళ్లు, మంత్రగాళ్ల కేటగిరీ కూడా ఉంది. ఇందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రతి పూట.. ఏదో ఒక చోట.. ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాల నమ్మితే బతుకులు చిత్తైపోతాయని గుర్తుచేస్తూనే ఉన్నాయి.

విశాఖ జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి

ఇటీవలే విశాఖలో జరిగిన ఘోరం.. మూఢనమ్మకాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పేందుకు ఓ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. జ్ఞానపురం చర్చిలో.. 11 ఏళ్ల బాలిక చనిపోయింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన చిన్నారికి గాలి సోకిందని భావించి.. ఆమె తల్లి, అమ్మమ్మ ప్రార్థనలు చేయించేందుకు విశాఖలోని జ్ఞానపురంలో ఉన్న ఓ చర్చిలోని.. జీసస్ బలిపీఠానికి తీసుకెళ్లారు. ఈ ప్రార్థనల సమయంలోనే.. చిన్నారి పూర్ణ చంద్రిక చనిపోయింది. అక్కడున్న ఆనవాళ్ల ప్రకారం.. బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి, నోటిలో గుడ్డలు కుక్కినట్లు తెలుస్తోంది.

ఆరోగ్యం కుదుటపడుతుందని తీసుకెళ్తే.. ప్రాణాలే పోయాయ్!

దాంతో.. ఆ బాలిక మృతి అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త బయటకొచ్చాక.. రెండు తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఆరోగ్యం కుదుటపడుతుందని చర్చికి తీసుకెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోవడమేంటని అంతా షాకయ్యారు. కానీ.. ఇదేం కొత్త కాదు. మంత్రాలని నమ్ముకున్నోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఇలాంటి దారుణాలు చాలానే ఉన్నాయి. అవన్నీ.. ఈ మధ్యకాలంలోనే జరిగాయి. అయినా.. జనంలో మార్పు రావట్లేదు.

అనుమానితులుగా ఉన్న చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య

తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.. చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి.. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: ముస్లిం యువతిని వివాహం చేసుకున్న టీనేజర్.. కత్తితో పొడిచి దారుణంగా హత్య

మంత్రాలకే అన్నీ నయమైపోతే.. ఈ చదువులెందుకు?

ఇంత టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలతో మోసపోతున్నారు కొందరు అమాయకులు. దోషాల నుంచి విముక్తి చేస్తామని కొందరు.. డబ్బుపై అత్యాశతో మరికొందరు.. ఇలా నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. అయినా.. మంత్రాలకే అన్నీ నయమైపోతే.. ఈ చదువులెందుకు? ఈ డాక్టర్లు ఎందుకు? ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇంత ఖరీదైన చికిత్సలెందుకు? మంత్రమే అన్నింటిని మాయం చేస్తే.. మనుషులకు రోగాలే రావు. వైద్యమే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేస్తారు. కానీ.. అలా జరగట్లేదు. కొందరు మాత్రమే గుడ్డిగా ఈ మంత్రాలని, తంత్రాలని నమ్ముతున్నారు. వాళ్లే అడ్డంగా మోసపోతున్నారు.

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×