E-Paper
Advertisement

Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!

Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!
Advertisement

Lovers incident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సరస్వతి (21) అనే యువతి, తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హాస్టల్ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. సరస్వతీ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడే తనకు నందకిషోర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరు గత మూడేళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఎంతో కొంత సంపాదించాలి అనుకున్న తను అక్కడే కాల్ సెంటర్‌లో టెలికాలర్‌గా పని చేసింది. అయితే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నందకిషోర్‌ని సరస్వతి గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని అడిగింది. దీంతో విరిద్దరి మధ్య కాస్త చర్చ జరిగింది.

Advertisement

అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం తన నివాసానికి వెళ్లిన సరస్వతి తిరిగి శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం నందకిషోర్, సరస్వతి ఆదివారం కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ పెళ్లి వివాదం రావడంతో నందకిషోర్ పెళ్లికి నిరాకరించాడు.. అంతేకాకుండా నువ్వు వెరే యువకుడితో తిరుగుతున్నావ్ అని అసభ్యకరంగా తిట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపనాకి గురైన సరస్వతి ఆదివారం మీర్‌పేట్లో తను ఉంటున్న హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read: ఈస్ట్ గోదావరి కొవ్వూరు హైవే‌పై కాలి బూడిదైన ట్రావెల్ బస్సు.. బస్సు లో 10 మంది..

Advertisement

ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు తన చెల్లికి సమాచారం తెలియజేశారు. దీంతో తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత బలహీనమనస్కురాలు కాదని, తన మరణానికి నందకిషారే కారణమణి సరస్వతి చెల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమ కూతుర మరణానికి కారణమైన నందకిషోర్ పై చర్యలు తీసుకోవాలంటూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సరస్వతి మృతికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×