BigTV English

TTD Vigilance: పోలీసులకు ఎదురుగా వెళ్లిన పుష్ప.. దడ పుట్టించిన టీటీడీ విజిలెన్స్

TTD Vigilance: పోలీసులకు ఎదురుగా వెళ్లిన పుష్ప.. దడ పుట్టించిన టీటీడీ విజిలెన్స్

TTD Vigilance: పుష్ప సినిమా ఫీవర్ ఏమో కానీ, ఇటీవల పుష్పాల ఆట కట్టించేందుకు పోలీసులు మాత్రం, సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర షేకావత్ కంటే వేగంగా పావులు కదుపుతున్నారు. దీనితో పుష్పలు ఇట్టే పోలీసులకు చిక్కుతున్నారని చెప్పవచ్చు. శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల నుండి ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, పలువురు స్మగ్లర్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు గురువారం పట్టుబడ్డారు.


అందిన వివరాల మేరకు..
శేషాచలం అడవుల్లో నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందని టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో పక్కా ప్రణాళిక రచించి అటవీ అధికారులు, స్మగ్లర్ల ఆట కట్టించారు.

గురువారం సాయంత్రం కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకొని, వాహన తనిఖీల నిమిత్తం కారును శిలా తోరణము సమీపంలో నిలిపివేశారు. కారును తనిఖీ చేయగా, వెనుక సీటులో గ్రేడ్-ఏ కు చెందిన ఎర్రచందనం దుంగలు పోలీసులకు కారులో కంటపడ్డాయి. ఓవైపు తనిఖీలు జరుగుతుండగా, మరోవైపు కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.


Also Read: Pawan Kalyan: పాపులారిటీ ఉంటే మేధావులు కానే కారు.. పవన్ సంచలన కామెంట్స్

గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పవిత్రమైన తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో స్మగ్లర్ల ఆట కట్టించారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ తెలియాల్సి ఉంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×