Blinkit Ambulance Service : క్విక్ కామర్స్ రంగంలో అనతి కాలంలోనే అద్భుతమైన విజయం సాధించిన బ్రింక్ ఇట్.. ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు కస్టమర్లకు కావాల్సిన సరకులు, ఇతర రోజువారీ వినియోగించే సమాన్లను డోర్ డెలివరీ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలోని బాధితుల్ని కాపాడేందుకు సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రాణాల్ని నిలబెట్టే అంబులెన్ సర్వీసులను మొదలుపెట్టింది. అవును.. బ్లింక్ ఇట్ వైద్యారోగ్య రంగంలోకి అడుగు పెట్టింది. ఓ చిన్న ఐడియాతో క్విక్ కామర్స్ రంగంలో మంచి గుర్తింపు సాధించిన ఈ సంస్థ.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
మీ చుట్టూ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డారా.? లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా.? అయితే వెంటనే బ్లింక్ ఇట్ ఓపెన్ చేసి అంబులెన్స్ బుక్ చేసేయండి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. బ్లింక్ ఇట్ లో ఇంట్లోకి సరుకులు వస్తాయి కానీ, అంబులెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. అలాంటి అనుమానాలు ఏం అవసరం లేదు. ఇప్పటి నుంచి అంబులెన్స్ సర్వీస్ లను కూడా బ్లింక్ ఇట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎందుకోసం బ్లింక్ ఇట్ 10 మినిట్స్ అంబులెన్స్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుతానికి గుజరాత్ లోని గురుగ్రామ్ లో ఈ సేవలను అందుబాటులో తీసుకు వస్తున్నట్లు క్విక్ కామర్స్ ప్లాట్ ఫారమ్ బ్లింక్ ఇట్ ప్రకటించింది. వైద్యారోగ్య రంగంలో అతిపెద్ద సమస్యను పరిష్కరించే క్రమంలో.. తాము మొదటి అడుగు ముందుకేసినట్లు సంస్థ సీఈవో అల్విందర్ థింసా ప్రకటించారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన నగరాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకు రానుండగా.. ఇందు కోసం ఐదు అంబులెన్స్ లను సిద్ధం చేసినట్టు సంస్థ తెలిపింది.
ఎంత ఛార్జ్ చేస్తారు..
బ్లింక్ ఇట్ అందుబాటులో తెచ్చిన అంబులెన్స్ లకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు అనే విషయాన్ని ఇంకా సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ సేవల్ని లాభాల కోసం ప్రారంభించడం లేదని తెలిపిన సంస్థ సీఈవో.. బాధితులకు తక్షణ సహాయం అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ సేవల విషయంలో లాభాపేక్ష లేకుండా పని చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే ఈ అంబులెన్స్ సేవలు ఉంటాయన్న బ్లింక్ ఇట్ సీఈఓ.. క్లిష్టమైన సమస్యకు సాంకేతిక పరమైన సులువైన పరిష్కార మార్గాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అభిప్రాయ పడ్డారు. అలాగే రానున్న రెండేళ్లలో ఈ సర్వీస్ లను దేశమంతటా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మొదట గురుగ్రామ్ లో ఈ సేవలు ప్రారంభం కాగా.. క్రమంగా దేశంలోని అన్నీ ప్రముఖ నగరాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అంబులెన్స్ లో ఆధునిక పరికరాలు
బ్లింక్ ఇట్ అందుబాటులోకి తీసుకు వస్తున్న అంబులెన్స్ లో అన్ని రకాల లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ను సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను రక్షించేందుకు కావాల్సిన సామాగ్రిని అందుబాటులో ఉంచనున్నారు. కాగా.. వీటిలో ఆక్సిజన్ సిలిండర్లు, AED (Automated External Defibrillators)లు, స్ట్రక్చర్లు, మానిటర్లు, సెక్షన్ మిషన్స్ తో పాటు అత్యవసరం ఔషధాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే ఈ అంబులెన్స్ లో ఓ పారా మెడికల్ సిబ్బంది, ఓ అసిస్టెంట్ తో పాటు శిక్షణ పొందిన డ్రైవర్ విధుల్లో ఉంటారని సంస్థ తెలిపింది. యాప్ లో అంబులెన్స్ బుక్ చేసుకుంటే.. 10 నిముషాల్లో సంఘటనా స్థలంలో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
Also Read : దేశభక్తి కోసం ఓ రోజు కేటాయించిన ప్రభుత్వం.. సెలవు రద్దు చేసి మరీ కార్యక్రమాలు