BigTV English

Bullet Train: గంటన్నరలోనే హైదరాబాద్ నుంచి విశాఖకు.. విమానంలో కాదు, రైల్లో!

Bullet Train: గంటన్నరలోనే హైదరాబాద్ నుంచి విశాఖకు.. విమానంలో కాదు, రైల్లో!

World’s Fastest High-Speed Train: ప్రపంచ రైల్వే వ్యవస్థలో ఊహించని రీతిలో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో వందల కిలో మీటర్లు దూసుకెళ్తున్నాయి. సుదూర ప్రయాణాల కోసం అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అద్భుతమైన సౌకర్యాలు, అత్యంత వేగవంతమైన ప్రయాణం ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. అందులో భాగంగానే సరికొత్త బుల్లెట్ రైలు ఆవిష్కృతం అయ్యింది. గంటలకు 450 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు గరిష్ట వేగంతో ప్రయాణిస్తే హైదరాబాద్ నుంచి వైజాగ్ కు కేవలం గంటన్నరలోనే దూసుకెళ్లనుంది. ఢిల్లీ నుంచి పట్నాకు 2.5 గంటల్లో చేరుకోనుంది. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్ కు కేవలం 1.5 గంటల్లోనే వెళ్లనుంది.


ఈ అత్యధునిక బుల్లెట్ రైలు ఎక్కడ ఆవిష్కృతం అయ్యిందంటే?  

భారత్ ఇప్పుడిప్పుడే రైల్వే వ్యవస్థ మీద ఫోకస్ పెట్టింది. సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుల్లెట్ రైలు నిర్మాణం పైనా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశం చైనా సరికొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలును పరిచయం చేసింది. ఈ రైలు ప్రయోగ దశలో భాగంగా గంటకు 450 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు వెల్లడించింది. ఈ రైలుకు సీఆర్‌450గా నామకరణం చేసింది. ఈ రైలు ప్రస్తుతం చైనాలో  గంటకు 350 కి.మీ.వేగంతో పరుగులు తీసే సీఆర్‌400 మోడల్‌ కంటే అడ్వాన్స్ డ్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు.


తుది మెరుగులు అద్దుతున్న అధికారులు

తాజాగా చైనా ఆవిష్కరించిన ఈ మోడల్ పై ఇప్పటికే చైనా రైల్వే అధికారులు బోలెడు ప్రయోగాలు చేశారు. కమర్షియల్  కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఈ రైలుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బుల్లెట్ రైళ్లకు సంబంధించి రెండు మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి సీఆర్450 ఎఫ్ కాగా, మరొకటి  సీఆర్450 ఏఎఫ్. ఈ లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక వాటర్ కూల్డ్, పర్మెనెంట్ మేగ్నెట్ ట్రాక్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ప్రొటెక్షన్ కోసం హైస్పీడ్ కోచ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ రైల్లో మల్టీ లెవల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ అత్యాధునిక బుల్లెట్ రైలులో స్టార్ హోటళ్లను మించిన వసతులు ఉన్నాయి. ప్రైవేట్ కంపార్ట్ మెంట్లు, రీక్లైనర్ సీట్లు ప్రయాణీకులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి.

భారత్ లో ఇప్పల్లో అలాంటి రైలు అందుబాటులోకి వచ్చేనా?  

నిజం చెప్పాలంటే చైనాతో పోల్చితే భారత్ రైల్వే వ్యవస్థలో చాలా వెనుకబడి ఉన్నది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే వ్యవస్థ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకుసాగుతున్నది. ఇప్పుడిప్పుడే సెమీ హైస్పీడ్ రైళ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వైపు అడుగులు వేస్తున్నది. అయితే, చైనా స్థాయి బుల్లెట్ రైళ్లను ఆవిష్కరించాలంటే మాత్రం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. చైనా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చిన రైలు ఇండియాలో తయారు కావాలంటే కనీసం రెండు దశాబ్దాలు పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు  వందే భారత్ కాదు.. ఇలాంటి బుల్లెట్ ట్రైన్ ఒక్కటి చాలు అని జనాలు అనుకుంటున్నారు. వారి కోరికలు నిజం కావాలంటే మరికాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

Read Also: ఇండియన్ రైల్వేలో మరో అద్భుతం, నదీ గర్భంలో దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?

Related News

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

Big Stories

×