Anantapur News: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కాఫీ గిన్నెకు భయపడి ఇద్దరు బాలికలు సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ స్థాయిలో చిన్నారులు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఈ విధంగా చేశారు? అన్న డీటేల్స్‌లోకి ఓసారి వెళ్లొద్దాం.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని టి. వీరాపురం గ్రామంలో బాలికల సూసైడ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఈశ్వరప్ప కూతురు 14 ఏళ్ల శ్వేత ఇంటిలో ఉంది. ఆ సమయంలో పొలం పనుల కోసం పేరెంట్స్ బయటకు వెళ్లారు.
గ్యాస్ పొయ్యిపై కాఫీ గిన్నెలో పాలు పెట్టి ఆడుకోవడానికి వెళ్లింది శ్వేత. అయితే ఆటలో పడిపోయి గ్యాస్‌పై పాలు పెట్టానన్న విషయం మరిచిపోయింది. పాలు పొంగిపోయి గిన్నె నల్లగా మాడిపోయింది. చివరకు ఇంట్లో నుంచి పొగ వాసన రావడంతో శ్వేతకు గుర్తు వచ్చింది. గ్యాస్‌పై పాలు పెట్టిన విషయం మరిచిపోయింది.
ఇంట్లోకి వెళ్లి చూసేపరికి కాఫీ గిన్నె నల్లగా మాడిపోయింది. రూమ్ అంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో శ్వేత భయందోళనకు గురైంది. ఈ విషయం తల్లిదండ్రులు తెలిస్తే తిడతారనే భయపడింది. అదే సమయంలో శ్వేత వారి ఇంటి పక్కన స్నేహితురాలు 9 ఏళ్ల మౌనికతో కలిసి సమీపంలోని దొణగంగమ్మ ఆలయం వద్దకు వెళ్లారు.
ALSO READ: ఏపీకి గుడ్ న్యూస్.. 27 వేల కోట్ల విలువైన ఆరు కొత్త ప్రాజెక్టులు
ఈ విషయం తన ఫ్రెండ్ మౌనికకు శ్వేత చెప్పిందా లేదా అనేది తెలీదు. ఇద్దరు కలిసి ఆడుకోవడానికి గ్రామం శివారులోని నీటి గుంటకు వెళ్లారు. అక్కడ ఆడుకుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. దీనిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికి వచ్చేసరికి కూతురు లేని విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ఊరంతా వెతుకులాట మొదలుపెట్టారు. చివరకు గ్రామ సమీపంలోని నీటి గుంటలో విగత జీవులుగా కనిపించారు. బాలికలిద్దరి మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. కాఫీ గిన్నె డ్యామేజ్ అయ్యిందన్న కారణంగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
శ్వేత వెళ్లినప్పుడు తన ఫ్రెండ్ మౌనిక తీసుకెళ్లడం కారణంగా చెబుతున్నారు. ఈ ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఏదేమైనా ఫ్రెండ్ షిప్ డే నాడు ఇద్దరు బాలికలు చనిపోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి.