E-Paper
Advertisement

Shahid Afridi: విరాట్ కోహ్లీ లాంటి అంధభ‌క్తుల వ‌ల్లే, పాకిస్తాన్ కంటే ఇండియా వెనుక‌బ‌డింది !

Shahid Afridi: విరాట్ కోహ్లీ లాంటి అంధభ‌క్తుల వ‌ల్లే, పాకిస్తాన్ కంటే ఇండియా వెనుక‌బ‌డింది !
Advertisement

Shahid Afridi:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య బంధాలు మరింత చెడిపోయాయి. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగితే కూడా.. షేక్ హ్యాండ్ కూడా ప్లేయర్లు ఇచ్చుకోవడం లేదు. అంతలా దూరం పెరిగింది. ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అలాగే విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటివాళ్ళను చూసి ఓర్వలేక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లేటెస్ట్ గా షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) కూడా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ వాది అయిన విరాట్ కోహ్లీని ముస్లింలు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. అంధ‌ భక్తుడైన ( Andhbhakts) విరాట్ కోహ్లీ (Virat Kohli) కారణంగా పాకిస్తాన్ కంటే ఇండియా వెనుకబడిపోయిందని బాంబు పేల్చారు. అంధ‌ భక్తుల కారణంగా ఇండియా డెవలప్మెంట్ ఆగిపోయిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

విరాట్ కోహ్లీని టార్గెట్ చేసిన పాకిస్తాన్ మాజీలు!

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) నేపథ్యంలో కేకేఆర్ పై విరాట్ కోహ్లీ ( Virat Kohli) అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు కోహ్లీ (Shahid Afridi). అంతేకాదు చివరి వరకు నిలబడ్డ కోహ్లీ.. బెంగళూరును గెలిపించాడు. అయితే ఈనింగ్స్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి అంద భక్తులు ఉండటం వల్ల పాకిస్తాన్ కంటే ఇండియా వెనుకబడిందని షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించారు. ఇలాంటివన్నీ దూరంపెట్టాలని పిలుపునిచ్చారు.

అటు విరాట్ కోహ్లీ సెంచరీ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 58 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ కప్ తీసుకువచ్చినట్లు విరాట్ కోహ్లీ ఫీల్ అయిపోతున్నాడని చురకలు అంటించారు. అదే 58 బంతులు నేను ఎదుర్కొని ఉంటే, 150 నుంచి 200 కొట్టేవాడిని వ్యాఖ్యానించారు. ఇక అటు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా కోహ్లీ పై మండిపడ్డారు. విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు చేసిన బాబర్ ఆజం కు ( Babar Azam) పోటీని ఇవ్వలేడని చురకలు అంటించారు. బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లీ దేనికి పనికి రాబోడని బాంబు పేల్చారు. ఇలా విరాట్ కోహ్లీని ఉద్దేశించి కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.

Advertisement

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

https://www.facebook.com/photo?fbid=122225158598289704&set=a.122097672758289704

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×