BigTV English

Vaikunta Ekadasi 2023 : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శోభ.. తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు

Vaikunta Ekadasi 2023 : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శోభ.. తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు
Vaikunta Ekadasi 2023 :

Vaikunta Ekadasi 2023 : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.


ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఒంటి గంటా 45 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ ఎస్‌.ఎల్‌. భట్టి, జస్టిస్‌ శ్యామ్‌ సుందర్‌, జస్టిస్‌ తారాల రాజశేఖర్‌, కర్ణాటక గవర్నర్‌ ధావర్‌ చంద్‌ గెహ్లాట్‌లు దర్శించుకున్నారు. ఇక.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్‌, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్‌, డిప్యూటీ స్పీకర్‌ వీరభద్ర స్వామి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.


ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

దాదాపుగా నాలుగు వేల మంది వీఐపీలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. అటు సామాన్య భక్తులకు ఇచ్చిన షెడ్యూల్‌ కంటే ముందే దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×