E-Paper
Advertisement

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో
Advertisement

Bhadrachalam:  భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రస్తుతం రామనామస్మరణతో మారుమోగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తుల కళ్లకు విందు చేసింది.

హంస వాహనంపై జలవిహారం సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కలిసి శ్రీరామచంద్రమూర్తి సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుదీరారు. గోదావరి నది తీరంలో విద్యుత్ వెలుగుల మధ్య, బాణాసంచా పేలుళ్ల హోరులో స్వామివారు నదిపై విహరించారు. గోదావరి అలలపై హంస వాహనం సాగుతుంటే..  భక్తులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక..  దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.

Advertisement

 

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×