BigTV English

Venkaiah Naidu : ‘పద్మ విభూషణ్ ‘.. నా బాధ్యతను మరింత పెంచింది..

Venkaiah Naidu : ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచం మరోసారి భారత్‌ వైపు చూస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగి దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసేందుకు పాటుపడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో ముందుకుపోతోందన్నారు. తనకు ‘పద్మవిభూషణ్’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం క‌ృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాతృభూమి సేవకు పునరంకితం అవుదామన్నారు. తనతోపాటు పద్మవిభూషన్ పురష్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తన నటనా మటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలన చిత్ర రంగానికి బహుముఖ సేవు అందించారని చిరంజీవిని ప్రశంసించారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×