Big Stories

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

Vijayawada court: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై రాయి విసిరిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

సింగ్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిందితుడు సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. బాధితుడు సీఎం అయినందున సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

అయితే నిందితుడు సతీష్ ను అతని తరఫు న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు సతీష్ గురువారం నుంచి శనివారం వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News