Building in Visakha: విశాఖపట్నం నగరంలో వన్‌టౌన్ వెలంపేటలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఐదు అంతస్తుల కసిరెడ్డి ప్లాజా, మూడంతస్తుల ధరణి ఫంక్షన్ హాల్ పక్కకు ఒరిగిపోవడంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పగుళ్లు పెరుగుతున్న శబ్దం, గోడలు చీలిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న వారిని భయాందోళనకు గురి చేశాయి. నాణ్యత లేకుండా నిర్మించడం వల్లే భవనం ఒక పక్కకు ఒరిగిపోయిందని స్థానికులు మండిపడుతన్నారు.
Also Read: Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
సురక్షితంగా బయటపడిన భవనాల ప్రజలు..
ఘటన సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కసిరెడ్డి ప్లాజా వద్దకు చేరుకుని భవనాల్లోని ప్రజలను సురక్షితంగా బయటకు తరలించారు. ఇప్పటికే రెండు బిల్డింగుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించిన పోలీసులు. సమీపంలోని ఇళ్లు, దుకాణాలు కూడా ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఐదంతస్తుల కసిరెడ్డి ప్లాజా, మూడంతస్తుల ధరణి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారనేది పోలీసులు విచారిస్తున్నారు. లోతట్టు ప్రాంతం కావడం, కట్టడానికి నాణ్యత లేని మట్టిని ఉపయోగించడం, భూగర్భ జలాల ప్రభావం అన్నీ కలిసి ఈ ఘటనకు దారితీశాయని స్థానికులు తెలిపారు. కానీ ఇన్ని రోజులుగా ప్రజలు నివసిస్తున్నా, వ్యాపారాలు నడుస్తున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. టౌన్ ప్లానింగ్ శాఖ నిర్లక్ష్యమే ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒరిగిన భవనంలో ప్లాట్ కొన్నవారి ఆవేదన..
ఇదే సమయంలో, ఈ ప్లాజాలో ఫ్లాట్లు కొన్న యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ కోసం 40 లక్షల రూపాయలు పెట్టామని, కానీ ఒక్కసారిగా జీవీఎంసీ అధికారులు భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించడంతో, తమ సామాన్లు అంతా లోపలే వదిలి కుటుంబాలతో బయటకు రావాల్సి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఫ్లాట్ల యజమానులు కోరుతున్నారు. ఈఘటనతో వారికి సంబంధం లేదని, ఇది వారి తప్పు కాదని, అసలు తప్పు భవనం నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి బాధ్యత వహించాల్సింది అధికారులే, తమకు నష్టం జరిగిందంటే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో పక్కకు ఒరిగిన ఐదు అంతస్తుల బిల్డింగ్
నగరంలోని వన్ టౌన్ వెలంపేటలో భూమి కుంగడంతో పక్కకు ఒరిగిన కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్ భవంతులు
ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఐదంతస్తుల కసిరెడ్డి ప్లాజా, మూడంతస్తుల ధరణి ఫంక్షన్ హాల్
లోతట్టు ప్రాంతం కావడంతో ఎలాంటి… pic.twitter.com/BXZAkqc9L5
— BIG TV Breaking News (@bigtvtelugu) August 21, 2025