Tamil Nadu Women Dies: ఇంటి నుంచి బయట వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేవరకూ నమ్మకం లేదు. ఏ ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో, ఎవరి గుండె ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు. ఆనందంగా గడుపుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే నమోదవుతున్నాయి. ముసలి వారి నుంచి చిన్న పిల్లలకు వరకు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే పరితమైన గుండెపోటు ఇప్పుడు చిన్నారుల నుంచి యువత కూడా వస్తున్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా, ఒక్క క్షణంలో గుండె ఆగిపోవడం అనేది వైద్య రంగాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురంలో ఇలాంటిదే ఒక విషాద సంఘటన జరిగింది.
కాంచీపురంకు చెందిన జీవా, ఆమె భర్త జ్ఞానం తమ స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మామల్లపురంలో మంగళవారం రాత్రి జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వెల్ మురుగన్‌తో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఆయన పాట పాడుతూ ప్రేక్షకులను తనతో పాటు వేదిక పైకి వచ్చి డాన్స్ చేయమని ఆహ్వానించారు. దీంతో జీవా కూడా వేదిక పైకి వెళ్లింది. వెల్ మురుగన్ పాటలకు స్టేజ్ పై అందరూ నవ్వుతూ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అకస్మాత్తుగా జీవా వేదికపై కుప్పకూలిపోయింది. స్టేజ్‌పై ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.
Also read: Hyderabad Land: ఎకరం భూమి రూ.70 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు
స్టేజ్‌పై పడిపోయిన జీవాను లేపడానికి ఎంత ప్రయత్నించిన జీవాలో ఎటువంటి చలనం లేకపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. ఒక్క క్షణం క్రితం ఆనందంగా నృత్యం చేసిన జీవా ఇక లేరని తెలియడంతో భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే జీవా చివరిసారిగా డ్యాన్స్ చేస్తూ, ఆనందంగా గడిపిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు.
ఇలాంటి సంఘటనలు ఇదొక్కటే కాదు. తమిళనాడులో 2025 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రసిద్ధ మిమిక్రీ ఆర్టిస్ట్, 53 ఏళ్ల రాజేష్ కన్నన్ తన బృందంతో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. జీవితం నిజంగా అతి తక్కువలో ముగిసిపోయే ప్రయాణం అని ఈ ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. మనం అనుకున్నట్లు అది జరగదు. గుండె ఒక్కసారిగా ఆగిపోతే మన ప్రయాణం కూడా అక్కడితో ముగిసిపోతుంది. అందుకే ఈ క్షణం మనదని గుర్తుంచుకోవాలి.
19 Aug 25 : A woman collapsed due to #ChipShot and died while dancing at a wedding reception in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district on Tuesday night.#heartattack2025 💉 pic.twitter.com/xO0f2BpNta
— Anand Panna (@AnandPanna1) August 20, 2025