E-Paper
Advertisement

Visakha Utsav 2026: సాగర తీరంలో విశాఖ ఉత్సవ్.. 8 రోజుల పాటు ఫుల్ జోష్… హైలెట్స్ ఇవే

Visakha Utsav 2026: సాగర తీరంలో విశాఖ ఉత్సవ్.. 8 రోజుల పాటు ఫుల్ జోష్… హైలెట్స్ ఇవే
Advertisement

Visakha Utsav 2026: విశాఖపట్నంలో ‘విశాఖ ఉత్సవ్’ ఎంతో వైభవంగా జరుగుతోంది. జనవరి 24న ప్రారంభమైన ఉత్సవ్ .. 31వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు నాన్‌స్టాప్ ఫెస్టివల్‌ గా నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్, గోకుల్ పార్క్, రుషికొండ, భీమిలి బీచ్‌లలోనూ ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డ్రోన్, మ్యూజికల్ షోస్

ఎనిమిది రోజులపాటు ప్రతి రోజు సాయంత్రం ఆర్కే బీచ్‌లో డ్రోన్ షో, మ్యూజికల్ షోలు నిర్వహిస్తారు. గోకుల్ పార్క్ లో కళాకారుల ఈవెంట్స్, రుషికొండ బీచ్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్, హెలి రైడ్స్, పారా‌సైలింగ్, స్కూబా డైవింగ్, కయాకింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. భీమిలి బీచ్‌లో బోట్ రేసింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

ఫ్లవర్ షో.. ఫ్రీ ఎంట్రీ

Advertisement

సెంట్రల్ పార్క్‌లో జనవరి 29, 30, 31 తేదీల్లో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. ఫ్లవర్‌ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. మూడు రోజుల పాటు ఈ షోను ఉచితంగా వీక్షించవచ్చు. పిల్లలకు చిల్డ్రన్స్ ఒలింపియాడ్, మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు, కోస్టల్ వాలీబాల్, ఫుట్‌బాల్,కబడ్డీ లీగ్‌లు నిర్వహిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు విశాఖ ఉత్సవ్ ను సందర్శించడానికి వస్తున్నారు. ఉత్తరాంధ్ర కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

Also Read:  రూ.15 వేలలో మూడు పవిత్ర క్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్

ఆర్టీసీ స్పెషల్ బస్సులు

Advertisement

ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవ్ లో 70 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల కోసం ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 14 ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. ఈ సర్వీసులు రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటాయి.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×