BigTV English

Visakhapatnam news: విశాఖలో ప్రభుత్వ శాఖలకు త్వరలో భవనాలు

Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి పరిపాలన అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Visakhapatnam news: విశాఖలో ప్రభుత్వ శాఖలకు త్వరలో భవనాలు
Visakhapatnam latest news

Visakhapatnam latest news(Andhra pradesh today news):

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి పరిపాలన అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


విశాఖపట్నంలోని రిషికొండ మిలీనియం టవర్స్‌లో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.


మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల కోసం 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భూమిని కేటాయిస్తున్నట్ల ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


ప్రభుత్వ కమిటీ నివేదిక మేరకు కార్యాలయాలతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన కోసం భవనాల వినియోగించుకునేందుకు ఈ భూమి కేటాయించినట్లు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

రుషికొండతోపాటు ఆంధ్రా వర్సిటీ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించారు. అలాగే ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో పలు శాఖలకు కేటాయించారు.

ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, జీఏడీ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో ఈ జీవోలో ప్రభుత్వం వెల్లడించలేదు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన ప్రారంభిస్తామని చెప్పారు. పలు మిడీయా సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ.. డిసెంబర్‌లోపే విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని చెప్పారు.

Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×