BigTV English

MLC: అంగట్లో శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీ కాసుల కక్కుర్తి..

MLC: అంగట్లో శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీ కాసుల కక్కుర్తి..
mlc-shaik-sabji-ttd

MLC: తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్ల కోసం ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్లో గోల్‌మాల్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో అవకతవకలు బయటపడగా.. ఇదే తరహా అనుమానాలతో టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ షాప్జీని పోలీసులు విచారిస్తున్నారు. ఒకే నెలలో 19 సిఫారసు లెటర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.


శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఆరుగురు వ్యక్తులు లెటర్లు తీసుకుని వచ్చారు. ఆధార్‌ కార్డుల్లో ఫేక్‌ అడ్రస్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. షేక్‌ షాప్‌జీ డ్రైవర్‌ బ్యాంకు అకౌంట్లోకి లక్షా 5వేల రూపాయలు బదిలీ అయినట్టు విజిలెన్స్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీని తిరుమల పోలీసులు విచారిస్తున్నారు.

తిరుమలలో తరచుగా ఇలాంటి వివాదాలు బయటపడుతున్నాయి. దేవస్థానం విక్రయించే బ్రేక్‌ దర్శనం టికెట్ల కోసం భక్తులు ఆసక్తి కబరుస్తారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. కొందరు తప్పుడు లేఖల ద్వారా టికెట్లు దక్కించుకుంటున్నారు. మరోవైపు, కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సిఫారసు లేఖల్ని దుర్వినియోగం చేస్తుండటం విమర్శల పాలవుతోంది. స్వామి వారి దర్శన టికెట్లు అమ్ముకున్న పాపం ఊరికే పోతుందా?


Related News

Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

Big Stories

×