E-Paper
Advertisement

Vizag CII Partnership Summit: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటి వరకూ ఎన్ని లక్షల కోట్లంటే..

Vizag CII Partnership Summit: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటి వరకూ ఎన్ని లక్షల కోట్లంటే..
Advertisement

Vizag CII Partnership Summit: విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర సిఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన వేదిక అని చాటిచెప్పారు.

గిరిజన సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సదస్సులో వైజాక్‌కు చెప్పిన కొత్త భాష్యం తెగ వైరల్ అవుతోంది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార పారిశ్రామక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. గత రెండు రోజులుగా లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి, సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. వివిధ పారిశ్రామిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో 613 ఎంవోయూలు చేసుకున్నాయి. విశాఖ సదస్సుకు ఒక రోజు ముందే గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోవడం గమనార్హం.

మరోవైపు సీసీఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త నిర్వచనం చెప్పారు. V- అంటే విజన్, I- అంటే ఇన్నోవేషన్ Z- అంటే జీల్, A-ఏస్పిరేషన్, G-అంటే గ్రోత్ అంటూ వైజాక్‌కి కొత్త భాష్యం చెప్పారు. ప్రస్తుతం ఈ కొత్త నిర్ణయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని స్పీడ్ డూయింగ్ బిజినెస్ అందరికి అర్ధమయ్యేలా రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు వినియోగించేలా అందరి సహకారాన్ని అభివృద్ధిని కోరుతూ.. రెండు రోజుల పాటు ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Advertisement

ఈ సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు పర్చువల్‌గా ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేమాండ్ మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ మైనీ, జతిన్ ఖన్నా, హాజరయ్యారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో ఏపీలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్స్ గ్రూపు. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్.. జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం శంకుస్థాపన చేశారు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫ్యాక్టరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తుంది రేమాండ్ గ్రూపు.

Also Read: ఉత్తరాంధ్రకు మరో విమానాశ్రయం.. ముందుకొచ్చిన ఏఏఐ

అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో మాన్యుఫ్యాక్టరింగ్ ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూపు. అనంతపురం జిల్లా టేకులూరు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూపు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×