E-Paper
Advertisement

Telangana Bjp: జూబ్లీహిల్స్ ఫలితం.. తెలంగాణ బీజేపీలో మొదలైంది, ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

Telangana Bjp: జూబ్లీహిల్స్ ఫలితం.. తెలంగాణ బీజేపీలో మొదలైంది, ఎమ్మెల్యే  రాజాసింగ్ హాట్ కామెంట్స్
Advertisement

Telangana Bjp: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ బీజేపీలో చిచ్చు రేగిందా? గ్రేటర్ హైదరాబాద్‌లో ఇన్నాళ్లు బలంగా కనిపించిన బీజేపీ, వచ్చిన ఓట్లతో అదంతా వట్టిదేనని తేలిపోయిందా? ఆ పార్టీలో అంతర్గతంగా చిచ్చు మొదలైందా? ఎందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ అంత మాట అన్నారు? కొన్నాళ్లుగా ఆయన హెచ్చరికలు నిజమేనా? అవుననే అంటున్నారు కొందరు నేతలు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

జూబ్లీహిల్స్ ఫలితం.. అప్పుడు బీజేపీలో లుకలుకలు

Advertisement

తెలంగాణ బీజేపీలో సీనియర్ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. ఇప్పుడు ఆ పార్టీ నేతలతో విబేధించి బయటకు వచ్చేశారు. అయినా పార్టీకి నష్టం జరిగితే ఆయన సహించలేకపోతున్నారు. అడపా దడపా సీనియర్లకు కౌంటర్లు ఇస్తున్నారు కూడా. ఏ విషయమైనా ముఖం మీద చెప్పేస్తారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోరు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూసి ఆయన ఒక్కసారిగా షాకయ్యారు. ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే మరో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించలేదన్నారు.

Advertisement

మరో 50 ఏళ్లయినా అధికారం కష్టమన్న రాజాసింగ్

జూబ్లీహిల్స్ ఓటర్లను తాము అండగా ఉన్నామని నేతలు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. ఈసారి గెలిపిస్తే, వచ్చే ఎన్నికలకు తాము అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పలేకపోయారన్నది ఆయన ప్రశ్న. ప్రస్తుతం జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే విధంగా వెళ్తే.. మరో 50 ఏళ్లయినా పార్టీ అధికారంలోకి రావడం కష్టమని కుండబద్దలు కొట్టేశారు.

ఓటర్లను ఏ విధంగా మన వైపు తిప్పుకోవాలి? అనేది నేర్చుకోవాలని సూచన చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.  ముఖ్యంగా కిషన్‌రెడ్డి అన్న అంటూ సంభోదిస్తూనే ఇది ఆవేదనగా బయటపెట్టారు.  రాజాసింగ్ తనపై కామెంట్స్ చేస్తున్నారని అస్సలు అనుకోవద్దని, ఇలాగే కంటిన్యూ అయితే పార్టీ నాశనం అవుతుందన్నారు. పార్టీని కాపాడండి, ఇదే తన విన్నపంగా పేర్కొన్నారు. 2023 ఎన్నిల కంటే ఈసారి తక్కువగా ఓట్లు వచ్చాయి.

ALSO READ:  కేటీఆర్ ఫెయిల్యూర్.. కేసీఆర్ లేకుంటే రామారావు నథింగా?

ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పంది ఒకవైపు వైర్షన్ మాత్రమే. రెండోవైపు పార్టీలో కొందరు నేతలు ఇదే విధంగా చర్చించుకుంటున్నారు.  అధికార కాంగ్రెస్ పార్టీకి తాము ప్రత్యామ్నాయం అని బయటకు చెబుతున్నారని, లోపల అలాంటి సీన్ కనిపించలేదని అంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితి కంటిన్యూ అయితే..  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటలేమని చర్చించుకుంటున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×