E-Paper
Advertisement

బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?

బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?
Advertisement

Amitabh Bachchan Death Threat: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ (Goldy Dhillon) నుంచి హత్య బెదిరింపులు రావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీ పోలీసులు ఇటీవల తన అనుచరులను అరెస్ట్ చేసినంత మాత్రాన ముంబైలో అమితాబ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రణాళిక ఆగిపోదని గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించాడు.

తన అనుచరులు వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌ల అరెస్టుతో తమ ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదని గోల్డీ ధిల్లాన్ తన పోస్టులో పేర్కొన్నాడు. ముంబైలో దాదాపు 200 మంది తమ అనుచరులు సిద్ధంగా ఉన్నారని అతడు చెప్పుకొచ్చాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు కట్టుకున్నా వారిని కాల్చి చంపుతాం’ అంటూ పోస్టులో తీవ్రస్థాయిలో బెదిరించాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారణమైన వారిని ఎప్పటికీ క్షమించబోమని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ధిల్లాన్ పేర్కొన్నాడు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టు అసలైనదా? కాదా? అన్న దానిపై క్లారిటీ లేదు.

Advertisement

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, తరణ్ తరణ్‌కు చెందిన దీపక్ సింగ్ అలియాస్ దీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం (జల్సా) వెలుపల కాల్పులు జరిపే కుట్రలో వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను డబ్బు కోసం బెదిరించి, కాల్చి చంపేందుకు పన్నిన మరో కుట్ర కూడా విచారణలో బయటపడింది. వ్యాపారవేత్తపై కాల్పులు జరిపే బాధ్యతను వికాస్ ఠాకూర్‌కు అప్పగించగా అతడు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చాడని దీపక్ సింగ్ అతడితో కలవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

నెల రోజుల వ్యవధిలో అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’కు మూడుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్ భద్రతను గణనీయంగా పెంచారు. ఈ క్రమంలోనే ప్రతీ ఆదివారం తన ఇంటి బయట అభిమానులకు అభివాదం చేసే అమితాబ్.. నవంబర్ 1న బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటున బయటకు వచ్చారు. మూడు వైపులా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చిన రక్షణ కవచం లోపల నిలబడి అభిమానులను పలకరించారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో బచ్చన్ కుటుంబం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

Tags

Related News

సింహాన్ని బైకులపై వెంబడించిన అటవీ సిబ్బంది.. తిరగబడ్డ మృగరాజు, వీడియో వైరల్!

గంటల వ్యవధిలో ఇద్దరు ప్రయాణికులు.. రైలు నుంచి సముద్రంలోకి జంప్, పంబన్ వంతెనపై ఘటనలు

విడాకుల రోజే రెండో పెళ్లి చేసుకున్నారా? తీర్పురాక ముందే.. చెల్లుబాటు అవుతుందా?

విగతజీవిగా ఇండిగో ఉద్యోగిని.. అసలేం జరిగింది? రంగంలోకి దిగిన పోలీసులు!

డేటింగ్‌ యాప్‌ లవ్.. యువకుడికి ఫ్యూజులు ఎగిరాయి, హర్యానాలో షాకింగ్ ఘటన

మరో 30 ఏళ్లయినా కాంగ్రెస్‌కు అధికారం దక్కదు: అమిత్ షా

రాజస్థాన్ రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాక్ గూఢచార సంస్థ.. డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా

Big Stories

Advertisement
×