E-Paper
Advertisement

Vizianagaram Students Struggle: గోతుల్లో దిగి.. అడవుల్లో నడిచి.. పవన్ కళ్యాణ్‌కు విద్యార్థుల విన్నపం

Vizianagaram Students Struggle: గోతుల్లో దిగి.. అడవుల్లో నడిచి.. పవన్ కళ్యాణ్‌కు విద్యార్థుల విన్నపం
Advertisement

Vizianagaram Students Struggle: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రాయపాలెం విద్యార్థుల గోడు హృదయ విదారకంగా ఉంది. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.” అంటూ ఆ పసిమొగ్గలు చేస్తున్న విన్నపం పాలకుల గుండెలను పిండేస్తోంది. ప్రతిరోజూ చదువుకోవడం కోసం ఏకంగా 12 కిలోమీటర్ల మేర అటవీ బాటలో.. కొండలు దిగుతూ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. వన్యప్రాణుల భయం.. రాళ్లు రప్పలతో కూడిన ప్రమాదకరమైన మార్గంలో సాగుతున్న ఈ ప్రయాణం తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తోందని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో.. నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. లోకేష్ గారే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ఈ గ్రామంలో కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో కేవలం విద్యార్థులే కాదు.. గర్భిణీలు.. వృద్ధులు సైతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అత్యవసర సమయంలో డోలీలే దిక్కుగా మారుతున్న దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దశాబ్దాలుగా పాలకులు మారుతున్నా.. తమ తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజనులు వాపోతున్నారు. పిల్లలు బడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది. అటవీ నిబంధనల సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని.. తమ కష్టాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని గిరిజన గ్రామం మొత్తం కన్నీరు మున్నీరవుతోంది.

Advertisement

తమకు పెద్ద భవనాలు.. సౌకర్యాలు ఏవీ అక్కర్లేదని.. కేవలం చదువుకోవడానికి ఒక రోడ్డు వేయాలని ఆ చిన్నారులు కోరుతున్నారు. పసి హృదయాల నుంచి వస్తున్న ఈ వేదనను పాలకులు ఆలకించి.. అటవీ క్లియరెన్స్ వంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించి తక్షణమే రహదారి పనులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం నగరాలకే పరిమితం కాకూడదని.. తమలాంటి అడవి బిడ్డల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని వారు ఆశిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో విస్మరణకు గురైన ఈ ప్రాంతానికి.. కూటమి ప్రభుత్వంలోనైనా మోక్షం లభిస్తుందని గిరిజనులు నమ్మకంతో ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని.. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని రాయపాలెం గ్రామస్థులు వేడుకుంటున్నారు. రోడ్డు లేక చదువుకు దూరం అవుతున్న గిరిజన విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని వారు కోరుతున్నారు. 12 కిలోమీటర్ల కొండ ప్రయాణానికి స్వస్తి పలికి.. తమ గ్రామానికి నాణ్యమైన రహదారిని మంజూరు చేయాలని వారు చేతులెత్తి మొక్కుతున్నారు.

Advertisement

Read Also: YSRCP : లడ్డూపై చర్చకు పట్టు.. వైసీపీ వర్సెస్ టీడీపీ వార్!

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×