OTT Movie : డిఫరెంట్ కంటెంట్ ను ఇవ్వడంలో హాలీవుడ్ మేకర్స్ ఒక అడుగు ముందే ఉంటారు. ఓటీటీలో కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను సర్చ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ ఫాంటసీ సినిమా, ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ కథ ఒక మ్యాజిక్ వల్ల, ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులు, ఒకరి బాడీ లోకి మరొకరు ప్రవేశిస్తారు. ఆ తరువాత కథ మరో లెవెల్ కి వెళ్తుంది. ఫ్యామిలీ సమస్యలు, ఫన్నీ సీన్స్‌తో ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఫ్రీకియర్ ఫ్రైడే’ (Freakier Friday) 2025లో వచ్చిన అమెరికన్ ఫాంటసీ కామెడీ సినిమా. నిషా గనాత్రా దీనకి దర్శకత్వం వహించారు. ఇందులో టెస్ (జేమీ లీ కర్టిస్), అన్నా (లిండ్సే లోహాన్), హార్పర్ (జూలియా బటర్స్), లిడియా (సోఫియా హామన్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 51 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది. ఇది 2025 ఆగస్టు 8న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇది 2003లో వచ్చిన ‘ఫ్రీకీ ఫ్రైడే’ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. 2025 అక్టోబర్ 7 నుంచి ఈ సినిమా డిస్ని ప్లస్ లో అందుబాటులోకి వచ్చింది.
అన్నాకు హార్పర్ అనే టీనేజ్ కూతురుతో పాటు, టెస్ ఒక గ్రాండ్ మదర్ కూడా ఉంటుంది. అన్నా తన ఫయాన్స్ ఎరిక్ ని పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఎరిక్‌కు కూడా లిడియా అనే టీనేజ్ స్టెప్ డాటర్ ఉంటుంది. ఈ రెండు ఫ్యామిలీలు పెళ్లితో కలవాల్సి వస్తుంది. ఇంతలో హార్పర్, లిడియా మధ్య గొడవలు మొదలవుతాయి. టెస్, అన్నా ఈ సమస్యలను సరిచేయడానికి ట్రై చేస్తారు. కానీ ఒక మ్యాజిక్ జరిగి, ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు. ఈ శరీరాలు మారిన తర్వాత, అందరూ ఒకరి లైఫ్‌ను మరొకరు జీవించాల్సి వస్తుంది. టెస్ అన్నా శరీరంలోకి వెళ్లి, పెళ్లి ప్లాన్స్, మదర్-ఇన్-లా రోల్ హ్యాండిల్ చేస్తుంది. అన్నా హార్పర్ శరీరంలోకి వెళ్లి స్కూల్, ఫ్రెండ్స్ వంటి టీనేజ్ సమస్యలు ఫేస్ చేస్తుంది.
హార్పర్, లిడియా కూడా ఒకరి శరీరంలో ఒకరు ఉంటూ, వాళ్ల గొడవలు, ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటారు. ఈ స్వాప్ వల్ల ఫన్నీ సీన్స్ వస్తాయి. గ్రాండ్‌మదర్ టెస్ మాత్రం ఇప్పుడు యంగ్‌గా పార్టీలు చేసుకుంటుంది. అందరూ ఒకరి లైఫ్‌ను, మరొకరు అర్థం చేసుకుని, ఫ్యామిలీ బాండింగ్ ను బలంగా ఉండేటట్లు చేస్తారు. క్లైమాక్స్ లో మ్యాజిక్ మళ్లీ జరిగి, అందరూ తమ ఒరిజినల్ శరీరాలకు తిరిగి వస్తారు. ఈ స్వాప్ వల్ల టెస్, అన్నా, హార్పర్, లిడియా ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకుంటారు. హార్పర్, లిడియా గొడవలు సమసిపోతాయి. అన్నా, ఎరిక్ పెళ్లి సక్సెస్‌ఫుల్‌గా జరిగి, ఈ రెండు ఫ్యామిలీలు హ్యాపీగా కలిసిపోతాయి. ఈ సినిమా ఫన్నీ, హార్ట్ టచ్ ఎండింగ్‌తో ముగుస్తుంది.
Read Also : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్