Guntur Crime: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి ఓ యువకుడి ప్రాణం తీసింది. సోదరి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిపై ఆమె సోదరుడు కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గణేశ్ అనే యువకుడు కొలకలూరుకి చెందిన యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులు వీరి ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుని గుంటూరు నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి సర్దిచెప్పారు. తన సోదరిని ప్రేమ పెళ్లి చేసుకున్న గణేశ్ పై యువతి సోదరుడు కక్ష పెంచుకున్నాడు.
పరిస్థితి చక్కబడిందనే లోపు యువతి సోదరుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి గణేశ్ పై చేసి హత్య చేశాడు. ప్రేమ పెళ్లి తమ బిడ్డ ప్రాణం తీసిందని గణేశ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. గణేశ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి సోదరుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది.
నెల్లూరు సిటీలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్క్ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకులను దారుణంగా చంపి పడేశారు. యువకులను హత్య చేసి మృతదేహాలను కాలువలో పడేశారు దుండగులు. స్థానికులు యువకుల మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : Visakha Tragedy: రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులు.. 5 రోజుల్లోనే ప్రాణం తీసిన ప్రమాదం
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరు యువకులను కర్రలతో కొట్టి చంపినట్లు నిర్ధారించారు. అనంతరం పెన్నానదిలో పడేసినట్లు గుర్తించారు. డీఎస్పీ సింధుప్రియ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతకక్షల కారణంగా హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.