E-Paper
Advertisement

Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ

Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ
Advertisement

Minister Narayana: విశాఖపట్నం నగరం అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా.. మంత్రి నారాయణ ఆదివారం VMRDA కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. నగరంతో అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులను స్పష్టంగా హెచ్చరించి, పనుల నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి గేట్‌వే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎయిర్‌పోర్ట్‌కి నగరం నలుమూలల నుంచి 7 ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం.. అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు.

Advertisement

నగరాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, విశాఖతీర అందాలను ప్రతిబింబించేలా కైలాసగిరిపై  50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

పట్టణాభివృద్ధిలో వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అన్నారు. న్యూ వలస సమీపంలోని 120 ఎకరాల్లో థీమ్‌-బేస్డ్ అర్బన్ సిటీ నిర్మాణానికి రూపకల్పన సిద్ధమవుతోంది. ఇందులో ఆధునిక రోడ్లు, పచ్చదనం, ఐటి-సర్వీస్ కారిడార్, సాంస్కృతిక జోన్, స్మార్ట్ హౌసింగ్ బ్లాకులు, పర్యాటక ఆకర్షణలు వంటి అంశాలు ఉండనున్నాయి.

Advertisement

ఇంటి కల నెరవేర్చడానికి ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఇక ఆలస్యం జరగకూడదు. జూన్ నెలాఖరులోగా అన్ని TIDCO ఇళ్ల పనులు పూర్తి చేసి అందజేయాలి. నాణ్యత విషయంలో ఎలాంటి సర్దుబాటు ఉండదు అని స్పష్టం చేశారు.

Also Read: వైసీపీ ఆఫీస్ దాడి ఎఫెక్ట్.. హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, నేతల హౌస్ అరెస్ట్

విశాఖపట్నం భవిష్యత్ 25–30 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న కొత్త మాస్టర్ ప్లాన్ తదుపరి తరం తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మంత్రి నారాయణ తెలిపారు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×