E-Paper
Advertisement

Python Snake: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన జనం

Python Snake: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన జనం
Advertisement

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ బయటపడటంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఒక డ్రైనేజీ కాలువలో నుంచి  పొలం లోకి ఇంజన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో అకస్మాత్తుగా సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ బయటకు వచ్చింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు.

అయితే జనసందోహాన్ని గమనించిన కొండచిలువ వెంటనే డ్రైనేజీ పక్కన ఉన్న పైపు మార్గంలోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది  కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

Advertisement

డ్రైనేజీ వ్యవస్థలో కొండచిలువ ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలు, పశువులను డ్రైనేజీ వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో యనమదుర్రు గ్రామంలో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×