రీసెంట్ గా పాకిస్థాన్ లో పశువుల ధరలు బాగా పెరిగాయి. అక్కడ పండుగ సీజన్ కావడంతో మేకలు, ఎద్దుల ధరలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పశువుల ధర పెంపు గురించి రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఓ లేడీ రిపోర్టర్ కు ఊహించని షాక్ తగిలింది. పీటూసీ చెప్తుండగా, రెండు ఎద్దులు ఆమె వైపు దూసుకొచ్చాయి. ఆ రిపోర్టర్ ను కిందపడేసి, తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పండుగ సీజన్‌కు ముందు పశువుల ధరల గురించి స్టోరీ చేసేందుకు ఓ లేడీ రిపోర్టర్.. సంతకు వెళ్లింది. మార్కెట్ లోని విజువల్స్ తీసుకుని, మేకలు, పశువుల యజమానులు, వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎందుకు ధరలు పెరిగాయి? ఎంత ధర పలుకుతున్నాయి? అనే వివరాల గురించి అడిగి తెలుసుకుంది. స్టోరీ ఎండింగ్ కోసం పీటూసీ చెప్తుండగా, ఊహించని ఘటన జరిగింది. రెండు ఎద్దులు అకస్మాత్తుగా ఆమె వైపు దూసుకొచ్చాయి. ఓ ఎద్దు ఆమెను బలంగా తగిలింది. ఒక్కసారిగా షాకై కిందపడిపోయింది. ఆమెను అలాగే తొక్కుకుంటూ వెళ్లిపోయాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. Xలో ఘర్కేకలేష్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది అయ్యోపాపం అంటుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ లోనే ఎందుకు జరుగుతాయి? అని కొంత మంది ప్రశ్నిస్తుంటే, ఎద్దులు ఎలా ఉంటాయో తెలియకుండానే రిపోర్టింగ్ చేస్తుందా? అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనలో లేడీ రిపోర్టర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఎద్దులు ఆమె మీది నుంచి వెళ్లినప్పటికీ, తొక్కకపోవడంతో పెద్దగా గాయాలు కాలేదు. అయితే.. ఈ ఘటనలో ఆమె మైక్రోఫోన్ ఎద్దు కొమ్ములలో చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే, అక్కడున్న పశువుల యజమానులు ఆమెను పక్కకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనను చిత్రీకరిస్తున్న వీడియో జర్నలిస్ట్ కాస్త దూరంగా ఉండటంతో అతడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే, రిపోర్టర్ ఇబ్బందుల్లో ఉంటే, ఆమెకు సాయం చేయకుండా వీడియోను షూట్ చేయడం ఏంటని మరికొంత మంది విమర్శిస్తున్నారు.
@gharkekalesh pic.twitter.com/ucWcRfEkfQ
— Arhant Shelby (@Arhantt_pvt) July 2, 2024
నిజానికి గత కొంతకాలంగా పాకిస్తాన్ లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలి వైరల్ క్లిప్ లో ఓ లేడీ రిపోర్టర్ లైవ్ లో ఉండగా, ఓ కుక్క సదరు రిపోర్టర్ నుంచి మైక్రో ఫోన్ ను లాక్కుంటున్నట్లు కనిపించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన మరొక వీడియోలో పొలాల్లో మేస్తున్న పశువుల గుంపు, రిపోర్టర్‌ను వెంబడిస్తున్నట్లు కనిపించింది. తాజా వీడియో మరోసారి ఫీల్డ్ రిపోర్టింగ్ విషయంలో ఎదురయ్యే సమస్యల గురించి చర్చకు కారణం అయ్యింది.
Read Also: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?