BigTV English
Advertisement

Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఏమైంది..! బీజేపీతో ఎవరికి బీపీ..?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఏమైంది..! బీజేపీతో ఎవరికి బీపీ..?
ap cm election news

Chandrababu Delhi tour: ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రిటర్న్ అయ్యారు. హస్తినలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయి.. అర్థరాత్రి చర్చలు జరిపిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. పొత్త ఖాయమైనప్పటికీ.. సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. అదలా ఉంటే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న టైంలోనే సీఎం జగన్ సడన్‌గా ఢిల్లీ టూర్ పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది .


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో? అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరి ఎన్నికలకు సిద్దమవుతుంటే.. సడన్‌గా బీజేపీ కూడా వాటితో కలవడానికి రెడీ అయింది.. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీ వెళ్లి సమావేశమై చంద్రబాబు పొత్తులపై చర్చలు జరిపి వచ్చారు. ఆ చర్చల్లో పొత్తు ఓకే అయిందని.. సీట్ల లెక్కలే తేలాల్సి ఉందని టీడీపీ, బీజేపీ శ్రేణులు అంటున్నాయి. సీట్ల సర్దుబాటుకి మూడు పార్టీల ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి… చర్చించుకుని ఫైనల్ డెసిషన్ వెల్లడిస్తారంటున్నారు.

అయితే 2014 పొత్తులో భాగంగా బీజేపీ పోటీచేసిన సీట్లతో పాటు.. అదనంగా మరిన్ని సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సర్దుబాటు లెక్కలు ఎలా ఉంటాయో కాని దానికంటే ముందే వైసీపీకి షాక్ ఇవ్వడానికి మిత్రపక్షాలు రెడీ అవుతున్నాయంటున్నారు. ఈ నెల 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న అంశం ఢిల్లీ భేటీలో చర్చకు వచ్చిందంట.. ఆ క్రమంలో సీఎం రమేష్‌ను లేదా సుజనా చౌదరిని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశముందంటున్నారు.


అదలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే టైంలోనే సీఎం జగన్ అక్కడకి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీకి వెళ్లారని.. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్ట్ కి రావల్సిన నిధులు, విభజన హామీల గురించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చర్చిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నిధులు, అప్పులు ఇతరాత్రా అవసరాల కోసం ఈ అయిదేళ్లలో జగన్ చాలా సార్లే ఢిల్లీ వెళ్లి వచ్చారు.

అయితే ఇప్పుడు ఇలాంటి కీలక సమయంలో ఢిల్లీ వెళ్ళడమే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య పాత పొత్తులు పొడుస్తున్న టైంలో జగన్ ఢిల్లీ వెళ్ళడం అందరిలో ఆసక్తి రేపుతోంది. గడచిన అయిదేళ్ళుగా మోడీ సర్కారుకి విధేయంగానే ఉంటూ వచ్చారు జగన్.. పార్లమెంటులో బీజేపీకి పూర్తి స్థాయిలో సహకారం అందించారు. దాంతో ఎన్డీయేకి తెర వెనక మిత్రుడిగా కూడా జగన్ ఫోకస్ అయ్యారు. ఈ నేపధ్యంలో బీజేపీ స్వయంగా ముందుకొచ్చి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న టైంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

సీఎం హస్తిన పర్యటన ఎందుకో? ఏమో? కాని.. దానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ మొదలైందిప్పుడు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టే చంద్రబాబు వెళ్లి అమిత్ షాను కలిశారు. మరి జగన్‌ను ఎవరు పిలిచారని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు..

అసెంబ్లీ వేదికగా కేంద్రం నుంచి నిధులు రావట్లేదని.. ఇచ్చిన నిధుల్లో కూడా కోతలు పెడుతోందని మోడీ ప్రభుత్వాన్ని .. మొట్టమొదటి సారి టార్గెట్ చేస్తు విమర్శిలు గుప్పించారు జగన్. దాంతో బీజేపీ బాస్‌లు కోపమొచ్చి ఆయన్ని పిలుపించుకున్నారేమో?.. అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.. మొత్తమ్మీద ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏపీ రాజకీయాలు హాట్ ‌టాపిక్‌గా మారాయి.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×