E-Paper
Advertisement

Ganja Racket: ధూల్ పేట్‌‌లో భారీగా గంజాయి సీజ్.. పరారీలో నిందితులు

Ganja Racket: ధూల్ పేట్‌‌లో భారీగా గంజాయి సీజ్.. పరారీలో నిందితులు
Advertisement

Ganja Racket: ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి కొని తెస్తూ హైదరాబాద్​ ధూల్ పేట కేంద్రంగా దందా చేస్తున్న నలుగురిని ఎక్సయిజ్​ ఎస్టీఎఫ్​ ఏ టీం అధికారులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 5.248 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ దందాలో మరో ముగ్గురు పాత్ర ఉన్నట్టు తెలియటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

లోకల్​ పెడ్లర్లకు 10వేలు

ధూల్​ పేట ప్రాంతంలోని జుమ్మేరాత్ బజార్ వాస్తవ్యుడైన వికాస్​ సింగ్​ ఎలియాస్​ విక్కీ(Vicky) సహచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవరకొండ నుంచి 2వేల రూపాయలకు కిలో చొప్పున ఆరు నుంచి పది కేజీల గంజాయి కొని తెచ్చి లోకల్​ పెడ్లర్లకు 10వేల రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నాడు. రీటైల్ లో 30గ్రాముల గంజాయిని 15వందల రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎస్టీఎప్​ ఏ టీం లీడర్​ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి వికాస్ సింగ్​ ఇంటిపై దాడి చేశారు. అతనితోపాటు గంజాయితోపాటు నాలుగు టూ వీలర్లు, అయిదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: Gold Rate Increased: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఒక్కసారిగా భారీగా పెరగడానికి కారణాలివే!

పరారీలో ఉన్న..

వికాస్​ సింగ్ తోపాటు మోతీలాల్ నర్సింగ్, ఆకాశ్​ సింగ్​, విశాల్ సింగ్ లను అరెస్ట్​ చేశారు. విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా రాజు, సంజయ్​ సింగ్​, మోతీ నర్సింగ్​ బాలాజీలపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను తదుపరి దర్యాప్తు నిమిత్తం ధూల్ పేట పోలీసులకు అప్పగించారు. మిగతా వారిని పట్టుకొని వారిని కూడా విచారించి డ్రగ్స్ సప్లైచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: Bird Flu Alert: బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాల్లో వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×