Witness Abduction: తిరుపతి జిల్లాలో సినిమా రేంజ్‌ని తలపించేలాంటి సీన్ ఎదురైంది. కోర్టులో సాక్షిని అపహరించి కొందరు బెదిరింపులకు పాల్బడుతున్నారు. ఈ సంఘటనతో తిరుపతిలో వైసీపీ నాయకులపై కేసు నమోదు అయింది. 2019 లో బెల్ట్ మురళి హత్య కేసుకు ప్రత్యక్ష సాక్షి మల్లరపు చిన్న ను కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కేసు ప్రస్తుతం తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణలో ఉంది. సాక్ష్యం ఇచ్చేందుకు వచ్చిన బాధితుడిని శీనురెడ్డి, వేణురెడ్డిని స్కూటీపై ఎక్కించి కిడ్నాప్ చేశారు. అనంతరం వీరిని ఎస్వీ మెడికల్ కాలేజీ సమీపంలోని లాడ్జికి తరలించారు. అక్కడ వినయ్, రవి, పసుపులేటి సురేష్‌తో పాటు మరికొందరు ఉన్నారని బాధితుడి ఆరోపణలు చేశాడు.
Alao Read: కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు
అయితే కేసులో లేని వ్యక్తుల పేర్లను కూడా కోర్టులో చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో భాదితులు పేర్కోన్నారు. నిరాకరించడంతో కారులో శ్రీకాళహస్తి వైపు తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. సాక్ష్యం మార్చకపోతే కుమారుడిని హత్య చేస్తామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించి భాద్యులపై కేసు నమోదు చేశారు.
Alao Read: మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!