BigTV English

YCP – Budget 2025 : బడ్జెట్ పై పెదవి విప్పని వైసీపీ.. అధినాయకుడు, కీలక నాయకుల మౌనం..

YCP – Budget 2025 : బడ్జెట్ పై పెదవి విప్పని వైసీపీ.. అధినాయకుడు, కీలక నాయకుల మౌనం..

YCP – Budget 2025 : ఏడాది పాటు దేశ గమనాన్ని, అభివృద్ధిని నిర్దేశించే దేశీయ పద్దు చిట్టా విడుదలైంది. కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై వివిధ వర్గాలు, వేరువేరు తీరులుగా స్పందించాయి. కొందరు బాగుంది అంటే, మరికొందరు తటస్థంగా ఉన్నారు. ఇక రాజకీయ నాయకులైతే.. వారి, వారి పార్టీలు, అజెండాలకు అనుగుణంగా మాట్లాడారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అభిప్రాయాల్ని వెల్లడించారు. కానీ.. ఏపీలో మాత్రం ప్రతిపక్షం కిమ్మనకుండా ఉండిపోయింది. అటు బాగుంది అని కానీ, ఇటు బాగోలేదు అని కానీ అనలేదు. అసలు.. వైసీపీ నాయకులు బయటకే రాలేదు. దీంతో.. ఏందుకీ మౌనం.? ఏమిటీ వ్యూహం? అంటూ చర్చలు జరుగుతున్నాయి.


కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో వైసీపీ భాగస్వామి కాదు. పైగా.. రాష్ట్రంలోని అధికార టీడీపీ, జనసేనా పార్టీలు వైరి పక్షం. అలాంటప్పుడు.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి మాట్లాడాలి. ప్రాధాన్య రంగాలకు దక్కిన నిధులు, దక్కాల్సిన వాటాల గురించి మాట్లాడుతుంటారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటాపై ఆ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇది సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ.. వైసీపీ మాత్రం కిక్కురు మనడం లేదు. అగ్రనేత జగన్ దగ్గర నుంచి కీలక నేతల వరకు అందరూ మౌనం వహించారు. దాంతో.. ఏం జరుగుతుంది అనే చర్య, గందరగోళం పార్టీ వర్గాల్లో నెలకొంది.

దశాదిశ లేని పార్టీ కేడర్..
బడ్జెట్ సమయంలోనే కాదు, అంతకు క్రితం పోలవరానికి ప్రత్యేక ప్యాకేజీ కానీ, అమరావతి నిర్మాణానికి సహకారం అందిస్తామన్న సందర్భంలో కానీ.. కూటమి పార్టీలు జోరుగా ప్రచారం చేసుకున్నాయి. వారి సాధించిన ఘనతగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అధికార కూటమి మంచి మార్కులు కొట్టేసింది. ఆయా సందర్భాల్లో వైసీపీ పార్టీ పూర్తి స్తబ్ధుగా మారిపోవడంతో కేడర్ కు అంతా అయోమయం పరిస్థితి నెలకొంది. కూటమి మద్ధతుదారులు, అభిమానులు, కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎలా స్పందించాలో, ఇంకా ఏ విషయాల్లో ప్రశ్నించాలో తెలియక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు.. బడ్జెట్ విషయంలోనూ వైసీపీ పార్టీ పూర్తి మౌనంగానే ఉంటోంది. దీంతో.. పార్టీ తీరుపై ప్రజల్లోకి ప్రతికూలంగా వెళ్లే ప్రమాదముందని, కూటమి పార్టీలు కేంద్ర నుంచి గట్టిగానే నిధులు సాధించినట్లు ప్రజలు భావించే అవకాశముందంటున్నారు. అదే జరిగితే.. పార్టీ పరంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.


అరెస్టుల భయం వెంటాడుతోందా.?
వైసీపీ ప్రస్తుతం పూర్తిస్థాయి స్వీయ రక్షణ స్థితి కంటే మరింత దిగజారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను సాధించిన గొప్పలు చెప్పుకునే స్థితి నుంచి ఇతరుల నుంచి వచ్చే విమర్శలను కౌంటర్ ఇచ్చేందుకు సైతం జంకే పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందంటున్నారు. వీటన్నింటికీ.. జగన్ మెడకు వేళాడుతున్న కేసులే కారణమని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారంటూ సొంత పార్టీ కేడరే వ్యాఖ్యనిస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీజేపీ నాయకులకు కోపం తెప్పిస్తే, అధినాయకుడిని మళ్లీ జైలుకు పంపే అవకాశాలున్నాయంటున్నారు. పైగా.. చంద్రబాబును జైలుకు పంపిన విషయంలో ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందన్నది వైసీపీలోనూ చాలా మంది అంగీకరిస్తున్నారు. దీంతో.. వైసీపీ అధినేత జగన్ కు అలాంటి పరిస్థితి ఎదురైనా.. జనం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో సానుభూతి సాధించలేమని అంటున్నారు.

Also Read :

తిరుమల విషయంలో గుర్రుగా బీజేపీ
హిందుత్వ సిద్ధాంతాలకు విలువిచ్చే బీజేపీ జగన్ పాలనలో రాష్ట్రంలో హిందువులు, హిందూ ఆలయాల పై జరిగిన దాడుల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చెబుతుంటారు. దానికి తోడు ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ విషయంలో కేంద్రంలోని పెద్దలు మరింత ఆగ్రహానికి గురయ్యారని, హిందూ వర్గాలు సైతం వ్యతిరేకిస్తుండడంతో వైసీపీ తీవ్ర ఆలోచనలో పడిపోయింది. ఇంకా ఆ విషయాలు రాష్ట్రంలో రగులుతూనే ఉండడంతో.. ప్రస్తుత బడ్జెట్ లో కానీ, ఇతర విషయాల్లో కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది అవుతుందని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×