BigTV English
Advertisement

Relationship Tips: పెళ్లయిన పురుషులు ఈ 4 రకాల స్త్రీలకు దూరంగా ఉండాలి, లేకుంటే…

Relationship Tips: పెళ్లయిన పురుషులు ఈ 4 రకాల స్త్రీలకు దూరంగా ఉండాలి, లేకుంటే…

వివాహం అనేది ఎంతో పవిత్రమైన బంధం. పెళ్లి అనేది నమ్మకం, గౌరవం, పరస్పర అవగాహన పై ఆధారపడి ఉంటుంది. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు నమ్మకంగా జీవించాలి. తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడంలో స్త్రీ పురుషులిద్దరి బాధ్యత ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని పెళ్లిళ్లు పెటాకులు అవుతాయి. దీనికి కారణం భార్య లేదా భర్త ప్రవర్తన సరిగా లేకపోవడమే. ఇద్దరిలో ఎవరి ప్రవర్తన సరిగా లేకపోయినా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వివాహం అయిన పురుషులు కొందరి మహిళలకు దూరంగా ఉండాలి. లేకుంటే వారి వైవాహిక జీవితం నాశనం అయిపోతుంది. ఎలాంటి మహిళలను పెళ్లయిన పురుషులు దూరంగా ఉంచాలో తెలుసుకోండి.


అతిగా పొగిడే స్త్రీలు
కొంతమంది స్త్రీలు పురుషుల చుట్టూ చేరి అతిగా పొగుడుతూ ఉంటారు. అలా పొగుడుతున్నారంటే వారి ఉద్దేశాలు, మనసులోని భావాలు సరైనవి కావని అర్థం చేసుకోవాలి. స్త్రీ మిమ్మల్ని అన్ని విషయాలలోనూ అతిగా పొగడడం, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం వంటివి చేస్తే మీరు ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకుంటే ఆ మీ జీవితంలో చొరబడే అవకాశం ఉంటుంది. అలాంటి వారితో పరిచయాలు మీకు మీ వైవాహిక జీవితానికి చేటునే చేస్తాయి.

వ్యక్తిగత వివరాలు అడిగే మహిళలు
కొందరి మహిళలు మగవారి చుట్టూ తిరుగుతూ వారి వ్యక్తిగత జీవితం గురించి వివాహ సంబంధాల గురించి అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భార్యతో మీరు ఎలా ఉంటారో, మీ భార్య మీతో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పదేపదే ప్రశ్నిస్తూ ఉంటారు. మీ వైవాహిక జీవితం గురించి మీ భార్య గురించి పదే పదే తెలుసుకోవాలని ప్రయత్నించే వారిని దూరంగా పెట్టాలి. వారి ప్రవర్తన ఉత్సుకత మాత్రమే కాదు మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడానికి సంకేతం కూడా కావచ్చు.


మాజీ ప్రేమికులు
పెళ్లికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు. కానీ పెళ్లయిన తర్వాత మాత్రం మీ భార్యని మాత్రమే ప్రేమించాలి. పెళ్లికి ముందు ప్రేమలన్నింటిని వదిలిపెట్టేయాలని. మీ పెళ్లయిన తర్వాత కూడా మీ మాజీ ప్రేమికులు కనిపిస్తే వారిని చూసి ఆకర్షితులవడం, వారితో అనుబంధాన్ని కొనసాగించడం, ప్రేమగా మాట్లాడడం వంటివి చేయకూడదు. పాత భావోద్వేగాలు కొన్నిసార్లు మీ పెళ్లి సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీ మాజీ ప్రేమికురాలు కనిపించినా కూడా ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇలాంటి సహోద్యోగులు
ఆఫీసులో మహిళా సహోద్యోగులు ఎంతోమంది ఉంటారు. వారితో ఒక పరిధి మేరకు మాత్రమే ఉండాలి. సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి మంచిదే కానీ కొంతమంది అమ్మాయిలు అతిగా మాట్లాడడం, అతిగా కలిసిపోవడం వంటివి చేస్తారు. ఇలాంటివి అంత మంచిది కాదు. అలాగే మీ వ్యక్తిగత విషయాలపై ఆసక్తి కనబరిచే మహిళా సహోద్యోగులను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. పూర్తిగా ఉద్యోగపరమైన సంబంధాలనే వారితో ఏర్పరచుకోవాలి. వ్యక్తిగత జీవితం నుండి వారిని ఎంత దూరంగా ఉంచితే మీ వైవాహిక జీవితం అంతా ఆనందంగా ఉంటుంది.

Related News

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Big Stories

×