Hyderabad News: హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసులపైకి దొంగ ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపైకి దొంగ రెండు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాల్పులకు తెగబడింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు. గాయాలపాలైన కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని, బౌన్సర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.