BigTV English

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ వైఖరేంటి..? వైసీపీ ప్రశ్నలు..

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ వైఖరేంటి..? వైసీపీ ప్రశ్నలు..

Vizag Steel Plant News (AP Updates): విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో స్టీల్‌ ప్లాంట్‌లో సింగరేణి బృందం సభ్యులు పర్యటించారు. స్టీల్‌ ప్లాంట్‌ బిడ్‌పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు.


ఈవోఐలో పాల్గొనేందుకు సింగరేణి డైరెక్టర్లను ఆహ్వానిస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది. డొల్ల కంపెనీలకు బిడ్‌ అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించింది. ప్రభుత్వ సంస్థలు భాగస్వాములుగా ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొంది. మూలధన సేకరణ కోసం స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతిపాదనల బిడ్డింగ్‌కు ఈ నెల 15లోగా సమ్మతి తెలపాలి. ఈ క్రమంలోనే ఈవోఐ సాధ్యాసాధ్యాలు, స్టీల్‌ ప్లాంట్‌ సేకరించే నిధులు, వాటిని సమకూర్చడం ద్వారా పొందే ఉత్పత్తుల వివరాలను విశాఖ ఉక్కు పరిశ్రమ ఉన్నతాధికారుల నుంచి సింగరేణి బృందం తెలుసుకుంది.

అదానీ కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారన్నారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై మాట్లాడుతున్నామనేది అవాస్తవమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఆసక్తి లేదని .. అక్కడి కేంద్రం ఏం చేస్తుందన్నదే ముఖ్యమన్నారు.


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే విషయంలో సీఎం జగన్ కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే అంశంపై ప్రధాని మోదీతోనూ మాట్లాడారని వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచిందన్నారు. కేంద్రం నడపలేని స్టీల్ ప్లాంట్‌ను ఓ రాష్ట్రం నిర్వహించగలదా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై అసలు బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారు? అని నిలదీశారు. ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశాఖ మెమొరాండం ఇచ్చిందని దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×