BigTV English

Dil Raju:- త‌లైవాతో దిల్‌రాజు మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!

Dil Raju:- త‌లైవాతో దిల్‌రాజు మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!

Dil Raju:- దిల్‌రాజు ఓ వైపు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూనే స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ మూవీల‌ను నిర్మిస్తున్నారు. తెలుగుకే ప‌రిమితం కాకుండా త‌మిళ సినిమాలు, పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు మ‌న స్టార్ ప్రొడ్యూస‌ర్‌. ఈ ఏడాది త‌మిళంలో వారిసు సినిమాతో ఆయ‌న ఎంట్రీ ఇచ్చేశారు. కోలీవుడ్ ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ సినిమా త‌మిళంలో ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ తెలుగులో మాత్రం ఓకే అనిపించుకుంది.


ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దిల్ రాజు మ‌రో త‌మిళ సినిమాను ప్లాన్ చేశారు. అదెవ‌రితోనో కాదు.. ఈసారి ఏకంగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తోనట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేయ‌బోతున్నారో తెలుసా!.. వంశీ పైడిప‌ల్లి. ఈయ‌న కెరీర్ ప్రారంభం నుంచి దిల్‌రాజుతోనే సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు దిల్‌రాజు మ‌రో సినిమాను కూడా ఇచ్చేశాడు. మ‌రి ఈ సినిమా ఎప్ప‌టికి ఫైన‌ల్ అవుతుందో చూడాలి. .ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ మూడు సినిమాలు చేస్తున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న జైల‌ర్ సినిమా ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. మ‌రో వైపు కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న లాల్‌ స‌లామ్ సినిమాలో త‌లైవా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీని త‌ర్వాత జై భీమ్ దర్శ‌కుడు జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది.

మరో వైపు దిల్ రాజు నిర్మాత‌గా రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజ‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు. త్వ‌ర‌లోనే హిట్ 2ను హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు. వీటితో పాటు మ‌రికొన్ని క్రేజీ ప్రాజెక్టుల‌ను తెర‌కెక్కించే పనిలో ఉన్నారు. మ‌రిన్ని భారీ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×