BigTV English

YCP Tickects Panchayiti : వైసీపీ 3వ జాబితా రిలీజ్‌తో పొలిటికల్‌ కాక.. పెరుగుతున్న అసంతృప్తుల జ్వాల

YCP Tickects Panchayiti : వైసీపీ 3వ జాబితా రిలీజ్‌తో పొలిటికల్‌ కాక.. పెరుగుతున్న అసంతృప్తుల జ్వాల

YCP Tickects Panchayiti : వైసీపీ లిస్టులు, జగన్‌ మార్పులు చేర్పుల వ్యూహంతో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మార్పుతో అసంతృప్తుల జ్వాల రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో నిన్నా మొన్నటి వరకు జై జగన్‌.. జై వైసీపీ అన్న నేతలు.. టీడీపీ, జనసేనల వైపు చూస్తున్నారు. గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


వై నాట్‌ 175 అంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా డోంట్‌ కేర్‌ అంటూ.. అధికారమే లక్ష్యంగా తన వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్‌. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలకు అభ్యర్థులను ప్రకచించిన ఆయన.. తాజాగా మూడవ లిస్టును కూడా రిలీజ్‌ చేశారు. అయితే.. చాలా వరకు మార్పులపైనే ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగానే మరో 21 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించారు. ఇందులో 6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలున్నాయి.

జగన్‌ నిర్ణయాలతో బొత్స కుటుంబానికి జాక్‌పాట్‌ తగిలింది. భార్య ఝాన్సీతోపాటు ఆయన మేనల్లుడికి కూటా టికెట్‌ కేటాయించారు. అలాగే మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడికి కూడా అసెంబ్లీ ఎన్నికల పోరుకు అవకాశం లభించగా.. కారుమూరి కొడుక్కి ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలో దించనున్నారు. పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేష్‌, రాయదుర్గం నుంచి గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అలాగే దర్శిలో బూచేపల్లికి మరోసారి చాన్స్‌ ఇచ్చారు. చిత్తూరు విజయానందరెడ్డి, రాజంపేట ఆకేపాటికి అవకాశం ఇవ్వగా.. కర్నూలు లోక్‌సభ సీటును మంత్రి జయరాంకు కేటాయింది. పార్థసారథికి మొండి చేయి చూపించింది.


మార్పులు చేర్పుల వ్యూహంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అసంతృప్తి నేతలు వేరే పార్టీలోకి చేరగా.. అదే బాటలో మరికొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు జంప్‌ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే తమ బలాబలాలు ప్రదర్శించేందుకు కూడా రెడీ అవుతున్నారు. మరోవైపు అసంతృప్తి నేతలంతా తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నాయి టీడీపీ, జనసేనలు. దీంతో ఎవరు ఏ గూటికి చేరనున్నారు? ఎన్నికల నాటికి జగన్‌తో ఉండేదెవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

.

.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×