BigTV English

Jagan vs Sharmila: రూటు మార్చిన జగన్.. షర్మిలా దెబ్బ మామూలుగా లేదుగా!

Jagan vs Sharmila: రూటు మార్చిన జగన్.. షర్మిలా దెబ్బ మామూలుగా లేదుగా!

Jagan vs Sharmila: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం జగన్ ఇబ్బందిపడుతున్నారా? ఎన్నికల తర్వాత కొన్నాళ్లపాటు మీడియాకు ముఖం చాటేసిన ఆయన.. తరుచూ కనపడేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బయటకు వచ్చిన ప్రతీసారి కొత్త అంశాలతో ప్రత్యర్థులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? కేవలం షర్మిల వల్లే మీడియా ముందుకొస్తున్నారా? ఇలా రకరకాలుగా ఏపీ ప్రజలు చర్చించుకోవడం మొదలైంది.


ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందుకు రాలేదు. ఎడిట్ చేసిన వీడియోలు మాత్రమే బయటకు వచ్చేవి. కేవలం పార్టీ నేతలు మాత్రమే మాట్లాడేవారు. అధికారం కోల్పోయి మూడునెలలు అవుతోంది. నాలుగైదు సార్లు మీడియా ముందుకొచ్చారంటే ప్రత్యర్థి పార్టీల నుంచి ఎంత ఇబ్బందిపడుతున్నారో అర్థమవుతోంది.

తన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నుంచి ముప్పు పొంచివుందన్న విషయాన్ని గ్రహించారు జగన్. అందుకే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ కాగితాలు పట్టుకుని వస్తున్నారు. నిజాలు కన్నా తన పార్టీ నేతలను కాపాడేందుకే ప్రయత్నిస్తు న్నారాయన. పిన్నెల్లి అరెస్ట్ విషయం, కార్యకర్తల హత్యల విషయంలోనూ ఇదే పంథాను అనుసరించారు. నిజాలు చెప్పకుండా అబద్దాలను వల్లె వేస్తున్నారు.


నిన్నకాక మొన్న విజయవాడ వరదల విషయంలోనూ పదే పదే అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ఈ విషయంలో జగన్ కంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కాస్త హుందాగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వరదల విషయంలో బాధితులను దైర్యం చెప్పాల్సిన మాజీ సీఎం, జైలులో ఉన్న నేతలను పరామర్శించడాన్ని రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు. ఎంత దారుణమంటే మీడియా ముందు బూతులు మాట్లాడటాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.

ALSO READ:  వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్యకు కారణాలివేనా..!

మరోవైపు షర్మిల మాత్రం వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కోసారి అధికార పార్టీకి తనదైన శైలిలో చురకలు అంటిస్తున్నారామె. అన్నా-చెల్లెలను గమనించిన రాజకీయ నేతలు జగన్ కంటే షర్మిల బెటరని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్, అందుకే మీడియా ముందు వస్తున్నారని ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నమాట.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×