BigTV English

AP Men Suicide In Varanasi: వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్యకు కారణాలివేనా..!

AP Men Suicide In Varanasi: వారణాసిలో అన్నదమ్ముల ఆత్మహత్యకు కారణాలివేనా..!

AP Men Suicide In Varanasi| ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నగరంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో నివసించే లక్ష్మి నారాయణ(34), వినోద్ (32) గా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ నెలలో వీరిద్దరూ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కొన్ని నెలలుగా వారి కోసం వెతుకుతున్నారు.


బంధువులు, స్నేహితులు అందరి ఇళ్లలో వారిద్దరి కోసం వెతికినా లాభం లేక పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్ష్మి నారాయణ, వినోద్ మిస్సింగ్ కేసుని నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు కథనం ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే ఇద్దరూ వ్యాపారపరంగా తీవ్ర నష్టాలు కలగడంతో అప్పుల పాలయ్యారు. దీంతో వారిపై అప్పులు తిరిగి చెల్లించాలని తీవ్ర ఒత్తిడి ఉండేది. ఈ కారణంగా ఇల్లు వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!


అలా ఆంధ్ర ప్రదేశ్ నుంచి పారిపోయి వారణాసిలోని ఒక ఆశ్రమంలో ఒక గది అద్దెకు తీసుకొని గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 09, సోమవారం రాత్రి ఆశ్రమంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇద్దరూ.. తమకు కొందరు చంపేస్తామని బెదిరిస్తన్నారంటూ వీడియోలు తీసి బంధువులకు పంపారు. ఆ తరువాత ఆశ్రమంలో వారిదరి మృతదేహాలు చూసి పోలీసులకు ఆశ్రమం వారు సమాచారం అందించారు. వారణాసి పోలీసులు వారి గుర్తింపు కార్డులను పరిశీలించి ఆంధ్రా పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా వారణాసి బయలు దేరి వెళ్లారు.

Also Read: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×