BigTV English
Advertisement

YS Sharmila Vs YS Bharathi: షర్మిల దూకుడుకి.. భారతి బ్రేక్ లు వేస్తుందా?

YS Sharmila Vs YS Bharathi:  షర్మిల దూకుడుకి.. భారతి బ్రేక్ లు వేస్తుందా?

YS Jagan Master Plan On YS Sharmila With Bharathi Reddy: జగన్‌కి అసలుసిసలు రాజకీయ ప్రత్యర్థిలా మారి వైసీపీ శ్రేణులకు చెమటలు పట్టిస్తున్నారు షర్మిల. వైసీపీ ఘోరపరాజయం తర్వాత కూడా ఆమె జగన్‌ని టార్గెట్‌ చేయడం ఆపడం లేదు. వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్‌ కలవాల్సిన పార్టీనే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారామె. అసలే ఓటమితో కోలుకోలేని గాయం తగిలిన వైసీపీ పుండుపై కారం చల్లుతూనే ఉన్నారు. మరోవైపు వైసీపీలో షర్మిల కామెంట్స్‌కు ధీటుగా కౌంటర్‌ ఇచ్చేందుకు జగన్ ఫ్యామిలీ ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారంట. తన సతీమణి భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి షర్మిలపై ప్రయోగించే ఆలోచనలో ఉన్నారంటున్నారు. భారతి పొలిటికల్ ఎంట్రీ ఆలోచన వెనుక జగన్‌కు వేరే లెక్క కూడా ఉందంట. అదేంటో మీరే చూడండి


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ టెన్షన్ తప్పిపోవడంతో రిలాక్స్ అయిన జగన్ మళ్లీ నవ్వుముఖంతో కనిపిస్తూ.. కూటమి ప్రభుత్వంపై సెటైర్లు మొదలుపెట్టారు. తాము చేసిన మేలు ఇంకా జనాల్లో ఉందంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతుంది కాని జగన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయడం లేదు. అసలు వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదు. వైసీపీ నేతలతో పాటు జగన్ దానిపై ఎక్కడ బెంగపెట్టుకుంటారో అన్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆ లోటు తీరుస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ఏ ధీమాతో చెప్తున్నారో కాని షర్మిల మాత్రం వైసీపీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు

షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైసీపీని, జగన్‌ని చీల్చి చెండాతున్నారు. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపక్షంగా కూటమి ఉన్నా విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఆమెను సమర్ధంగా ఎదుర్కోవడం ఎవరి తరం కావడం లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. ఓటమి తరువాత ఆయన సైలెంట్ అయ్యారు.


ఇప్పుడు పేర్ని నాని సీన్‌లోకి వస్తున్నా.. షర్మిల దూకుడు ముందు ఆయన తేలిపోతున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారంట. షర్మిలను కట్టడి చేయకపోతే మొదటికే మోసం వస్తుందని.. వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారంట. అందుకే ప్రత్యామ్నాయంగా షర్మిలను ఢీ కొనడానికి తన సతీమణి భారతీ అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా, జగన్ భార్యగా ఆమె ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే.. ప్రజలు ఆహ్వానిస్తారని జగన్ భావిస్తున్నారంట.

జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ఓ పిల్ల కాలువ అని, అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్‌లో కలవాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల.. వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.. గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసినా.. తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనక ఏమైనా మతలబు ఉందా..? అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Also Read: వైసీపీ నేత అవినాష్‌కు బిగ్ షాక్.. దుబాయ్ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా.. విలీనం అవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్‌గా మారాయి. ఇప్పటికే ఏపీలోనూ బలపడాలని, అందుకోసం ఏమేం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న టైంలో షర్మిల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ క్రమంలో జగన్ టార్గెట్‌గా దూకుడు పెంచుతున్న షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. షర్మిలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు.

షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలభిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని జగన్ భావిస్తున్నారంట. గతంలో మంత్రులుగా పని చేసిన రోజా, విడదల రజిని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణితోపాటు మహిళా కమిషన్ చైర్మన్‌గా పని చేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తోన్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు. దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు భారతితో పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని ఆలోచిస్తున్నారంట. మరోవైపు జగన్‌ను పాత కేసులు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసుతోపాటు బాబాయ్ వివేకా హత్య కేసు కూడా ఆయనకు గండంగా మారింది. జగన్ కేసులపై రోజువారి విచారణ చేపట్టాలని కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి.

కేసుల ఉచ్చులో బిగుసుకుపోయిన జగన్ అరెస్టు అయితే పార్టీని నడిపించే నేత అవసరం. అందుకే భారతిని సిద్ధం చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్‌ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని  అలాగే తనకు ప్రత్యామ్నాయంగా పార్టీ పగ్గాలు చేపట్టడానికి భారతి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారంట.తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో.. భారతిని తెరపైకి తేవడానికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×