YS Jagan: నెక్స్ట్ మన పాలన ఎలా ఉంటుందంటే, ఎవరి ఊహకు కూడ అందదు. వారిచ్చింది తప్పక వారికే డబుల్ ఇస్తాం అంటూ కూటమిని ఉద్దేశించి మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల సమావేశంలో జగన్ మాట్లాడారు. ఈ సంధర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.
జగన్ మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలంటూ సీఎం చంద్రబాబు అబద్దపు హామీలు గుప్పించి, ఒక్క హామీ కూడ నెరవేర్చలేదన్నారు. ఏవైనా హామీల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. వైసీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, మన కార్యకర్తలను కొట్టేది వాళ్లే అక్రమ కేసులు పెట్టేది వాళ్లేనంటూ జగన్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, ఒక మనిషిని ఏకంగా 10 చోట్ల తిప్పుతున్నారన్నారు. శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ప్రతి జిల్లాలో నాలుగైదు రోజులు ఉంచుతున్నారని, పోలీసులు కూడ అదే తరహాలో వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు.
అధికారం చేపట్టిన 8 నెలల కాలంలో రూ. 3 వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ వర్తించక ఎందరో పేదవాళ్లు వైద్యశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. తన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, కరోనా కాలంలో కూడ పథకాలకు ఎక్కడా లోటు కనిపించలేదన్నారు.
Also Read: Tirumala News: HMPV వైరస్.. భక్తులకు కీలక సూచన చేసిన టీటీడీ చైర్మన్
సంక్రాంతికి జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయాలని, తాను జనవరి నెలాఖరున జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాలలో పర్యటిస్తానని, అక్కడే పల్లె నిద్ర కార్యక్రమం కూడ నిర్వహిస్తానన్నారు. పార్టీ కార్యకర్తలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని కోరారు. తన పర్యటన రూట్ మ్యాప్ రెడీ అవుతుందని, పార్టీ నేతలకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రత్యేక లీగల్ టీం ను ఏర్పాటు చేసి ఇటీవల ఎందరికో అండగా నిలిచామని జగన్ తెలిపారు. మొత్తం మీద సంక్రాంతి తర్వాత జగన్ టూర్ ఖరారు కానుందని చెప్పవచ్చు.
వైసీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను : జగన్
మన కార్యకర్తలను కొట్టేది వాళ్లే అక్రమ కేసులు పెట్టేది వాళ్లే
ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు
ఒక మనిషిని ఏకంగా 10 చోట్ల తిప్పుతున్నారు
శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ప్రతి జిల్లాలో నాలుగైదు రోజులు ఉంచుతున్నారు… pic.twitter.com/S7InUmIYTG
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025