BigTV English

Haindava: టైటిల్ గ్లింప్స్ తోనే అదరగొట్టేశాడు.. బెల్లంకొండకు ఈసారైనా హిట్ దక్కేనా.. ?

Haindava: టైటిల్ గ్లింప్స్ తోనే అదరగొట్టేశాడు.. బెల్లంకొండకు ఈసారైనా హిట్ దక్కేనా.. ?

Haindava: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్  వారసుడిగా అల్లుడు శ్రీను అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాధారణంగా స్టార్ హీరోల కొడుకుల ఎంట్రీకి ఎంత ఖర్చు చేస్తారో అందరికీ  తెల్సిందే. కానీ, బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ అంతకుమించి ఉంది అంటే అతిశయోక్తి కాదు. కొన్ని కోట్లు పీతి ఆ సినిమాను నిర్మించాడు సురేష్. ఇక ఈ సినిమా శ్రీనివాస్ కు భారీ విజయాన్ని అందించలేకపోయినా అతనికి మంచి గుర్తింపుని  తీసుకొచ్చి పెట్టింది. దీని తరువాత జయాపజయాలను లెక్కచేయకుండా శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.


గతేడాది ఈ కుర్ర హీరో తెలుగులో ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. కానీ, హిందీలో మాత్రం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ అంతా కాకపోయినా.. తన బాడీతో కొంతమేర ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, సినిమా మాత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇలా కాదని బెల్లంకొండ శ్రీనివాస్ రూట్ మార్చాడు. కథలను మంచిగా ఎంచుకొని.. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Deepika Padukone: సింపుల్ లుక్ లో దీపిక.. డ్రెస్సు కాస్ట్ ఎంతంటే ..?


ప్రస్తుతం శ్రీనివాస్ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ తో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో కొత్త సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హైందవ.  మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

  ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  ఒక గుడిని కొంతమంది దుండగులు కాలుస్తూ ఉంటారు. దాన్ని ఆపడానికి బైక్ పై శ్రీనివాస్ వస్తూ ఉంటాడు. ఇక అతనికి ఒకపక్క సింహం, ఇంకోపక్క ఖడ్గ  మృగం  పరిగెత్తడం చూపించారు ఇక దుండగులను హీరో చితక్కొట్టి  అగ్నితో వారిని దహనము చేస్తాడు. ఇక ఆ మంటల్లో నుంచే మూడు  నామాలు చూపించి.. ఈ సినిమా పురాణాలకు సంబంధించినట్లు హింట్ ఇచ్చారు.

BalaKrishna : బాలయ్యను ఊరిస్తున్న ఆ రికార్డు… డాకుతో కొత్త రికార్డు క్రియేట్ అవ్వడం పక్కా..!

ఇక చివర్లో  అఖండ  రేంజ్ లో  కింద హీరోను.. పైన  స్వామివారి రూపాన్ని చూపిస్తూ ఒక్కసారిగా  సినిమాపై హైప్ క్రియేట్  చేశారు. టోటల్ గా గ్లింప్స్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ కు విజయం అందుతుందో లేదో చూడాలి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×