YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ విడుదల చేసిన ‘ప్రోగ్రెస్ రిపోర్టు’పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు ఘనాపాటి’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసింది ప్రగతి నివేదిక కాదని, గతి తప్పిన నివేదిక అని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు.
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్
ఈ రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయంగా మారిందని షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. ఎన్నికల వాగ్దానాలను పక్కనబెట్టి చంద్రబాబు గారడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు దక్కాల్సిన పెన్షన్లలో సగానికి సగం కోతలు విధించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారని వెల్లడించారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి నయవంచన చేశారన్నారు. దీపం పథకం సగం కుటుంబాలకే పరిమితం కాగా, సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీకి రూ.4,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.10,000 కోట్లు బకాయిలు పెట్టి గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ఒకవైపు విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నామని చెప్తూనే, రూ.15,000 కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రజలపై మోపడాన్ని ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులు చేస్తూ.. గత 12 ఏళ్లుగా టీడీపీ, వైఎస్సార్సీపీలు కలిసి ప్రతి పౌరుడిపై సరాసరి రూ.2 లక్షల అప్పు భారం మోపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి ముసుగులో మరో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేయడం తప్ప రాష్ట్రానికిరిగే ప్రయోజనమేమీ లేదని షర్మిల స్పష్టం చేశారు.
Also Read: హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!