New Mahindra Scorpio N 2026 Launched: మహీంద్రా పాపులర్ SUV స్కార్పియో-N ఫేస్ లిఫ్ట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.69 లక్షలుగా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.25.49 లక్షల వరకు ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ ఫేస్ లిఫ్ట్ లో డిజైన్ కంటే ఫీచర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.
కొత్త స్కార్పియో-Nలో 12.3 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. అలాగే, మొదటిసారిగా పనోరమిక్ సన్ రూఫ్, 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా లాంటి ప్రీమియం ఫీచర్లను యాడ్ చేశారు. ముందు సీట్ల కోసం 65W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. స్కార్పియో-Nకు ఉన్న బాక్సీ లుక్, క్రోమ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, C-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్ అలాగే ఉన్నాయి. అయితే, టాప్ వేరియంట్లలో కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఈ SUV ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, ఓషియానిక్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.
క్యాబిన్ లో పలు మార్పులు చేశారు. కొత్త టచ్ స్క్రీన్ తో పాటు రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, మెరుగైన స్విచ్‌లు, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ఇంజిన్ పనితీరు, వెహికల్ రోల్, పిచ్, కంపాస్, ఆల్టీమీటర్, జీ ఫోర్స్ లాంటి వివరాలను డ్రైవర్ స్క్రీన్ పైనే చూడవచ్చు. ఇతర ఫీచర్లలో వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అలెక్సా కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ SUV ఆరు సీట్లు, ఏడు సీట్ల లే అవుట్లలో అందుబాటులో ఉంటుంది.
భద్రత విషయంలో కూడా స్కార్పియో-Nను మరింత అప్ డేట్ చేశారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, డ్రైవర్ డ్రౌజినెస్ అలర్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. టాప్ Z8L వేరియంట్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి లెవల్ 2 ADAS ఫీచర్లు కూడా అందించారు.
ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్లలో ఎంపిక చేసిన మోడళ్లకు 4XPLOR ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.
Read Also: టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!