-జగన్ బెయిల్ రద్దు అంశంపై స్పందించిన షర్మిల
-అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
-ఈడీ జప్తు చేసేవి ఆస్తులే..షేర్లను కాదు
-షేర్లను ఎవరూ ఎటాచ్ చేయలేరు
-కనీసం జ్ణానం లేకుండా నేతలు మాట్లాడుతున్నారు
-అమ్మ రాసిన లేఖతో సంబంధం లేదు
-ఆమె స్వచ్ఛందంగా లేఖ రాశారు
-కంపెనీ మీదే స్టేటస్ కో ఉంటుంది
-షేర్ల మీద స్టేటస్ కో ఉండదు
-అన్న గెలుపు కోసమే పాదయాత్ర
-జగన్ ఆర్థిక లావాదేవీలకు దూరం
-మొదటినుంచీ పట్టించుకోలేదు
అమరావతి, స్వేచ్ఛ:
Sharmila on Jagan: మాజీ ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతోందని అనడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ ఆస్తుల వివాదంపై బుధవారం షర్మిల మరోసారి స్పందించారు. రూ.32 కోట్ల విలువ కలిగిన కంపెనీ స్థిరాస్తి మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని అన్నారు. అంతేకానీ కంపెనీ షేర్లను కూడా అటాచ్ చేసిందని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని షర్మిల వైసీపీ నేతలపై మండిపడ్డారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేతలు బహిరంగ లేఖను రాసిన నేపథ్యంలో వైఎస్ షర్మిల మరోసారి ఆ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. బుధవారం వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆస్తులపైనే ఎటాచ్ మెంట్లు
ఈడీ ఎటాచ్ మెంట్లు కేవలం ఆస్తులనే చేస్తారని..షేర్లపై ఎవ్వరూ అటాచ్ చేయరని..షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. 2016లో జగన్ కు సంబంధించిన భూములను మాత్రమే ఎటాచ్ చేశారని..ఆ కంపెనీ షేర్ల మీద కాదని తెలిపారు. వాస్తవానికి స్టేటస్ కో ఉన్నది ఆ భూములు, కంపెనీ మీద మాత్రమే అన్నారు. కంపెనీలకు సంబంధించిన షేర్లు బయట బహిరంగ మార్కెట్లో విలువను బట్టి నిరంతరం వాటి వాల్యూ పెరుగుతుంటుందన్నారు. వాటిపై ఈడీకి ఎలాంటి అధికారం ఉండదని అన్నారు. ఈ విషయాలనై అవగాహన లేని వైసీపీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. షేర్ మార్కెట్ల గురించి ఈ నేతలకు అస్సలు తెలియదని..అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read: వాళ్లిద్దరూ అవిభక్త కవలలు
గిఫ్ట్ డీడ్ అని..
తన తల్లి విజయమ్మ ఫోలియో నెంబర్లతో సహా గిఫ్ట్ డీడ్ అని సంతకం పెట్టి పత్రాలు ఇచ్చారని గుర్తుచేశారు. 2021లో సరస్వతి షేర్లను రూ.42 కోట్లకు అమ్మారని..అప్పుడు స్టేటస్ కోను ఉల్లంఘించనట్లు కాదా అని ప్రశ్నించారు. అప్పట్లో జగన్, భారతి ఇద్దరూ కలిసి అమ్మకు గిఫ్ట్ డీడ్ గా సంతకం చేసి మరీ ఇచ్చారన్నారు. వాటికి సంబంధించిన షేర్ల వ్యవహారంతో వారికి సంబంధం లేదని అన్నారు. విజయమ్మ రాసిన బహిరంగ లేఖ ఆమె వ్యక్తిగతమని..ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తనని మొదటినుంచీ జగన్ వ్యాపార లావాదేవీలకు దూరంగా ఉంచారన్నారు. అయినా తాను అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర చేసి తన అన్న గెలుపుకోసం అహర్నిశలూ పాటుపడ్డానని అన్నారు.
సీఎం అయ్యేందుకు పాదయాత్ర
తన అన్న జైలులో ఉన్నా..తిరిగి వచ్చాక సీఎం అయ్యేందుకు శాయశక్తులా పోరాడానని అన్నారు. విజయవాడలో తన సమక్షంలోనే ఎవరెవరికి ఎంతెంత ఆస్తులో ఎంఓయూ రాయించుకున్నారని అన్నారు. తనకు ఆస్తిలో హక్కు ఉన్నది కాబట్టే రూ.200 కోట్ల డివిడెండ్ ఇచ్చారని అన్నారు షర్మిల. ఇదేదో జగన్ నాకు గిఫ్ట్ గా, దయాదాక్షిన్యంగా ఇచ్చింది కాదు..బాధ్యతగా ఇవ్వాల్సిన ఆస్తి అన్నారు. సరస్వతి పవర్ వాటాలలో వంద శాతం కేసులు, ఈడీ, జప్తు తో సంబంధం లేని ఆస్తులు అవి అన్నారు షర్మిల.