BigTV English

NTR: అబ్బాయ్ టాలీవుడ్ ఎంట్రీ.. బాబాయ్ దీవెనలే హైలైట్

NTR: అబ్బాయ్ టాలీవుడ్ ఎంట్రీ.. బాబాయ్ దీవెనలే హైలైట్

NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు ఎనలేని ఖ్యాతిని అందుకున్నారు. ఆయన వంశవృక్షం నుంచి ఎంతోమంది హీరోలు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ.. ఇలా ఎంతోమంది హీరోలు వచ్చారు. ఇక తాజాగా మరో వారసుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెల్సిందే. నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రామ్. కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెల్సిందే. ఆయన కొడుకే నందమూరి తారక రామారావు అలియాస్ రామ్ నందమూరి.


ఇక ఈ కుర్రాడిని ఇండస్ట్రీకి  పరిచయం చేసే బాధ్యతలను స్టార్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి అందుకున్నాడు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు రామ్ నందమూరికి పంచెలు వేసినప్పుడు తీసిన ఫోటో తప్ప ఇప్పటివరకు ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు.. ? అనేది ఎవరికి తెలియదు. హీరోగా ఆ కుర్రాడు ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పడమే తప్ప అతనిని చూపించలేదు కూడా. దీంతో రామ్ నందమూరి ఎలా అంటాడు అనే ఆత్రుత ప్రేక్షకుల్లో పెరుగుతూ వచ్చింది.

Ananya Panday: బాయ్ ఫ్రెండ్ రూమర్స్ అన్నీ నిజమే… పోస్ట్‌తో కన్ఫామ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..!


ఇక నేడు ఎట్టకేలకు రామ్ నందమూరిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. రామ్ నందమూరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను  రిలీజ్ చేశారు. ఇక ఏమో అనుకున్నాం కానీ, కుర్రాడు మాత్రం అదిరిపోయాడు. టాలీవుడ్ టైగర్ ష్రాఫ్ లా కండలు తిరిగిన దేహం.. పొడవైన  జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు. ఇక రామ్  నందమూరి టాలీవుడ్ ఎంట్రీకి బాబాయ్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అన్న జానకి రామ్ కొడుకు కావడంతో  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం అబ్బాయ్ ను ఆశీర్వదించాడు.

” టాలీవుడ్ లో మొదటి అడుగు వేయబోతున్న రామ్ కు  నా శుభాకాంక్షలు  తెలుపుతున్నాను. సినిమా ప్రపంచం మిమ్మల్ని ఆదరించడానికి ఎదురుచూస్తోంది. మీకు కచ్చితంగా విజయమే దక్కుతుంది.  మన ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. దేదీప్యమానంగా వెలుగు మై బాయ్” అంటూరాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  మరి మొదటి సినిమాతో నందమూరి వారసుడు  ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×