BigTV English

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం.. ఎక్స్ వేదికగా విమర్శలు

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం.. ఎక్స్ వేదికగా విమర్శలు

YS Sharmila: ఏపీ కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు పక్షపాతిగా హామీలు ఇచ్చి ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదంటూ ట్విటర్ వేదికగా ఆమె ఆరోపించారు.


వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి రైతుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా పల్నాడు జిల్లాలో రైతులు రాత్రి సమయం వరకు విత్తనాల కోసం నిలబడ్డారని తెలిపారు.సాగర్ కుడికాలువ క్రింద పంట సాగు చేసే రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. కుండపోత వర్షాలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత ప్రభుత్వం రైతుల కోసం పని చేయకపోవడం వల్లే రైతులు కూటమికి పట్టం కట్టారని తెలిపారు.

జగన్ రైతులను నిండా ముంచాడనే కదా.. 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో జతకూడటంతో పాటు రైత పక్షపాతిగా ఉంటామని చెబుతూ అసత్యపు హామీలను కూటమి ఇచ్చిందని అన్నారు. ఇప్పటికైనా రైతులకు అవసరం అయిన 384 రకం విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×