BigTV English

Madhuri Reaction: ప్రస్తుతం మేమిద్దరం కలిసే ఉంటున్నాం: మాధురి

Madhuri Reaction: ప్రస్తుతం మేమిద్దరం కలిసే ఉంటున్నాం: మాధురి

Madhuri about duvvada srinivas(Andhra news today): ఎమ్మెల్సీ దువ్వాడ సతీమణి వాణి ఆరోపణలపై మాధురి స్పందించారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దువ్వాడ వాణి పిలుపుతోనే నేను వైసీపీలోకి వచ్చాను. ఇప్పుడు తాను ఎవరో తెలియదంటున్నారు. ఆమె తన స్వార్థం కోసం నాపై నిందలు వేస్తుంది. నా వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసింది. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో దువ్వాడ శ్రీను నాకు అండగా నిలిచారు.


దువ్వాడ శ్రీనివాస్ నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ప్రస్తుతం దువ్వాడ, నేను కలిసే ఉంటున్నాం. ఆత్మహత్య చేసుకోబోయిన నన్ను దువ్వాడ చేరదీశారు. అన్ని కుదిరితే పెళ్లి గురించి ఆలోచిస్తా’ అంటూ ఆమె పేర్కొన్నారు.

Also Read: ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు వివరాలు వెల్లడించిన మంత్రి


ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తమ తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్నాడంటూ, తమ వద్దకు రావాలంటూ ఆయన కూతుర్లు కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి తండ్రిని కలిసే ప్రయత్నం చేశారు. తండ్రికి కూతుర్లు ఫోన్ చేసినా, మెస్సేజ్ లు పెట్టినా ఆయన స్పందించలేదు. ఇంటి గేటు కూడా తీయకపోవడంతో వారు కారులోనే కొద్దిసేపు వరకు తండ్రి కోసం ఎదురుచూసి చివరకు వెనుదిరిగారు.

కాగా, గత రెండేళ్ల నుంచి దువ్వాడ కుటుంబంలో విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య జెడ్పీటీసీ వాణి వేరువేరుగానే ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వైసీపీ అధిష్టానం శ్రీనివాస్ ను టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జిగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను దువ్వాడ వాణికి అప్పగించింది. అయితే, మళ్లీ ఎన్నికల సమయానికి శ్రీనివాస్ కే టికెట్ కేటాయించారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య వార్ తారాస్థాయికి చేరిన విషయం విధితమే.

Related News

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

MP Avinashreddy: అవినాష్‌రెడ్డికి గడ్కరీ సర్‌ ప్రైజ్.. ఆ పార్టీల మధ్య ఏం జరుగుతోంది?

Big Stories

×