BigTV English

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..

YS Sharmila : రాజశేఖర్‌రెడ్డి ఆశయాల నేరవేర్చడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు.

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..

YS Sharmila : రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు నేరవేర్చడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు.


తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయ వచ్చానని తెలిపారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్‌, ఆ పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణంతో సమానం అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నేరవేర్చడం కోసం ఎంతదూరమైనా వెళ్లేవారని ఆమె పేర్కొన్నారు. భారత దేశంలో రాజ్యాంగానికి గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు నిలబడాలి, దేశానికి మంచి జరగాలనే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆమె ప్రకటించారు. దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసేంత వరకు తన పోరాటం ఆగదు అని ప్రకటించారు.

కొన్ని పార్టీలు ఇతర పార్టీలకు బానిసలుగా మారాయని మాజీ మంత్రి రఘవీరారెడ్డి పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ బానిస కాదన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసే వరకు అందరం కలిసి సమిష్టగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిలా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పనిచేశారని సీనియర్ నేత కేవీపీ రామచంద్రరరావు పేర్కొన్నారు. వైఎస్ హయంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఆయన ఆశయాల కోసం, రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకే షర్మిల కాంగ్రెస్‌లో వచ్చారని ఆయన వివరించారు. షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత షర్మిల తొలిసారి కడప జిల్లాకు వచ్చారు. షర్మిలకు కాంగ్రెస్‌ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీనియర్‌నేతలు తులసిరెడ్డి, శైలజానాథ్‌, గౌతమ్‌, అహ్మదుల్లా తదితరులు షర్మిలకు స్వాగతం పలికారు.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×