BigTV English

Nara Lokesh – Sharmila: నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ కానుక.. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు

Nara Lokesh – Sharmila: నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ కానుక.. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు

Nara Lokesh – Sharmila: ఏపీ రాజకీయంలో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రిస్మస్ రోజున పులివెందుల CSI చర్చిలో కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేయాల్సిన షర్మిల.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. అన్న జగన్‌కు రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్‌కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల పంపిన గిఫ్ట్‌కు లోకేష్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపి రాజకీయ పరిణతి ప్రదర్శించారు. అయితే.. ఎప్పుడూ లేనిది, ఎన్నికల ముంగిట్లో, లోకేష్‌కు షర్మిల ఎందుకు గిఫ్ట్ పంపించారనేది ఆసక్తిగా మారింది.


మొన్నటికి మొన్న చంద్రబాబును కలిశారు ఒకప్పటి జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు జగన్ సొంత చెల్లెలు షర్మిల.. క్రిస్మస్ వేడుకలకు రాకపోగా .. తన రాజకీయ ప్రత్యర్థి లోకేష్‌కు గిఫ్ట్ పంపారు. నిజానికి జగన్, లోకేశ్ మధ్య నిత్యం రాజకీయ యుద్ధం జరుగుతోంది. అటు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు తెలిపింది టీడీపీ. అదే కాంగ్రెస్‌కు షర్మిల అనుబంధంగా ఉంటున్నారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కూడా చేపడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ప్రభుత్వాన్ని నడుపుతున్న సొంత అన్నపై ఆమె పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.

.


.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×